లెనిన్ పై మెగా ఫ్యాన్స్ సెటైర్లు..

అక్కినేని అఖిల్ నటించిన లెనిన్ మూవీ ఇదిగో వస్తుంది.. అదిగో వస్తుంది అంటున్నారు కానీ.. రావడం లేదు. వాయిదాల మీదా వాయిదాలు పడుతూనే ఉంది. జూన్ 26న రావాల్సిన లెనిన్ లేటెస్ట్ గా జులై 10కి పోస్ట్ పోన్ అయ్యింది. ఇదిలా ఉంటే.. లెనిన్ గురించి మెగా ఫ్యాన్స్ సోషల్ మీడియాలో సెటైర్లు వేయడం.. వైరల్ అయ్యింది. చిరు, నాగ్ మధ్య, చరణ్‌, అఖిల్ మధ్య మంచి అనుబంధం ఉంది కదా.. అయినా మెగా ఫ్యాన్స్ లెనిన్ పై కామెంట్స్ చేయడానికి కారణం ఏంటి..?

అక్కినేని అఖిల్ కెరీర్ కి చాలా అంటే చాలా ముఖ్యమైన సినిమా లెనిన్. అందుకనే.. ఈ సినిమా విషయంలో కింగ్ నాగార్జున చాలా కేర్ తీసుకుంటున్నారు. ఈ మూవీని మే 1న విడుదల చేస్తున్నట్టుగా ప్రకటించారు. ఆతర్వాత ఏప్రిల్ 30న పెద్ది వస్తుందని అనౌన్స్ చేశారు. అంటే.. ఒకరోజు గ్యాప్ లో చరణ్ పెద్ది, అఖిల్ లెనిన్ రానున్నాయనేది ఆసక్తిగా మారింది. అయితే.. చరణ్‌ తో అఖిల్ కి ఉన్న అనుబంధం కారణంగా లెనిన్ మూవీని వాయిదా వేస్తున్నట్టుగా ప్రకటించారు. ఆతర్వాత పెద్ది కూడా ఏప్రిల్ 30న రాకుండా.. జూన్ 4న రిలీజైంది. జూన్ 26న లెనిన్ రిలీజ్ అంటూ అనౌన్స్ చేశారు.

ఇటీవల లెనిన్ ప్రమోషన్స్ లో స్పీడు పెంచారు. ఇంకేముంది.. లెనిన్ జూన్ 26న థియేటర్స్ లోకి వచ్చేందుకు రెడీ అవుతున్నాడు అని అక్కినేని అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తుంటే.. మరోసారి లెనిన్ పోస్ట్ పోన్ అనే వార్త ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చింది. జులై 10న లెనిన్ వస్తుందని నాగార్జున సోషల్ మీడియా వేదికగా అనౌన్స్ చేశారు. ఇక అక్కడ నుంచి సోషల్ మీడియాలో మెగా ఫ్యాన్స్ లెనిన్ పై కామెంట్లు పెట్టడం.. సెటైర్లు వేయడం హాట్ టాపిక్ అయ్యింది.

చిరంజీవి, నాగార్జున మధ్య మంచి అనుబంధం ఉంది. అలాగే చరణ్‌, అఖిల్ మధ్య కూడా మంచి బాండింగ్ ఉంది. మెగా ఫ్యాన్స్, అక్కినేని ఫ్యాన్స్ మధ్య కూడా మంచి అనుబంధం ఉంది. అలాంటిది లెనిన్ పై మెగా ఫ్యాన్స్ సెటైర్లు వేయడానికి కారణం ఏంటంటే.. లెనిన్ సినిమా రెడీ కాకుండా.. పెద్ది సినిమా కోసం పోస్ట్ పోన్ చేస్తున్నట్టుగా ప్రకటించారని.. ఇప్పుడు పెద్ది కలెక్షన్స్ కోసం పోస్ట్ పోన్ చేసామని చెబుతారా ఏంటి..? అంటూ మెగా అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్లు పెట్టడం వైరల్ అయ్యింది. అయితే.. లేట్ అయినా లేటెస్ట్ గా రావాలి.. బ్లాక్ బస్టర్ కొట్టాలని అఖిల్ తపిస్తున్నాడు. మరి.. అఖిల్ ఆశించిన విజయాన్ని లెనిన్ అందిస్తుందో లేదో చూడాలి.

Latest Articles

జగన్‌కు మంత్రి లోకేష్‌ సవాల్

మాజీ సీఎం, వైసీపీ అధ్యక్షుడు జగన్‌కు మంత్రి లోకేష్‌ సవాల్ విసిరారు. జగన్‌ ఇంటికి 200 మీటర్ల దూరంలో ఉన్నానని.. డీఎస్సీపై అనుమానాలుంటే సమాధానం చెప్తానని అన్నారు. ధైర్యం ఉంటే చర్చకు రావాలని సవాల్‌...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
347FollowersFollow
424,168SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్