హైదరాబాద్‌లోని మణికొండ శివాజీ నగర్‌లో అమావాస్య పూజల వివాదం రేగింది. మణికొండ శివాజీ నగర్‌లో అమావాస్య రోజు నిర్వహించిన ప్రత్యేక పూజలు వివాదానికి దారితీశాయి. ఇంటి ముందు కుంకుమ, పసుపు, నిమ్మకాయలు ఉంచి పూజలు చేయడంపై స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ పూజలు చుట్టుపక్కల వారిలో భయాందోళనలు కలిగిస్తున్నాయని స్థానికులు ఆరోపించారు. దీంతో సంబంధిత కుటుంబాన్ని ప్రశ్నించగా రెండు వర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. వాగ్వాదం క్రమంగా ఘర్షణకు దారితీయగా, ఓ మహిళ ఎదురింటి వారి కళ్లలో కారం చల్లినట్లు ఆరోపణలు వచ్చాయి. ఘటనతో శివాజీ నగర్‌లో కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. రాయదుర్గం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు
హైదరాబాద్ మణికొండ శివాజీ నగర్‌లో అమావాస్య పూజల వివాదం
0
41
Latest Articles
నువ్వు ఎదగాలంటే ఏం చేయలి?
కర్మ అనేది ఒక ఆధ్యాత్మిక నియమం. ఇది న్యూటన్ భౌతిక శాస్త్ర నియమానికి సమానం."ప్రతి చర్యకు సమానమైన వ్యతిరేక చర్య ఉంటుంది. సంస్కృతంలో కర్మ అనే పదానికి చర్యలు అని అర్థం. మంచి...
- Advertisement -
- Advertisement -


