అమెరికా-ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం కుదిరిందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. ఆ దేశంపై తమ నావికా దిగ్బంధనం ముగుస్తుందని ట్రంప్ తెలిపారు. ఇక ఎలాంటి సుంకాలు లేకుండా హర్మూజ్ జలసంధి తెరుచుకుంటుందన్నారు. ప్రపంచంలోని నౌకలు.. మీ ఇంజిన్లను స్టార్ట్ చేయండి. హర్మూజ్ జలసంధి ద్వారా చమురు రవాణా చేయండి… అని తన ట్రూత్ సోషల్ మీడియాలో పేర్కొన్నారు. శాంతి ఒప్పందానికి సహకరించిన అందరికీ అభినందనలు తెలిపారు. అయితే.. ఈ శాంతి ఒప్పందానికి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడి కాలేదు. మరోవైపు ఇరాన్ ఈ ఒప్పందంపై ఇంకా స్పందించలేదు. అయితే పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కూడా ఈ డీల్ విషయాన్ని ధ్రువీకరించారు. డీల్‌పై శుక్రవారం నాడు సంతకాలు చేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.
అమెరికా-ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం
0
47
Latest Articles
తెలంగాణలో భారీ వర్షాలు…ప్రాజెక్టులకు జలకళ
ఎగువన కురుస్తున్న వర్షాలతో తెలంగాణలోని పలు ప్రాజెక్టులు జలకళ సంతరించుకున్నాయి. ఎగువ నుంచి వస్తున్న వరదతో SRSP,కడెం, ఎల్లంపల్లి, జురాల ప్రాజెక్టులు నిండుకుండలా మారాయి. భారీ వర్షాల నేపథ్యంలో కడెం ప్రాజెక్టు నిండుకుండలా...
- Advertisement -
- Advertisement -


