గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం రిజిస్ట్రార్ ఆఫీస్ ఎదుట స్టాంప్ రైటర్లు నిరసన తెలిపారు. స్టాంప్ రైటర్ల పొట్టకొట్టేలా జీవో 369ను తీసుకొచ్చారన్నారు. జీవో 369ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈనెల 20 నుంచి 31 వరకు పెన్‌డౌన్ కార్యక్రమం నిర్వహిస్తామని వెల్లడించారు. రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో ఫ్రంట్ ఆఫీసులను ఏర్పాటు చేసి కార్పొరేట్ సంస్థలకు అప్పగించాలని ప్రభుత్వం చూస్తుందని స్టాంప్ రైటర్లు ఆరోపించారు. దశాబ్దాల తరబడి ఈ వృత్తిపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నామన్నారు. ప్రత్తిపాడు నియోజకవర్గం ప్రత్తిపాడు, కాకుమాను మండలాల్లో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలున్నాయన్నారు. ఇక నుంచి ఇక్కడ పనిచేస్తున్న స్టాంప్ రైటర్లు ఉపాధి కోల్పోతారని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రత్తిపాడు రిజిస్ట్రార్ ఆఫీస్ ఎదుట స్టాంప్ రైటర్ల నిరసన
0
71
Previous article
Next article
Latest Articles
క్షమాపణ చెబుతారని అనుకన్నా.. కానీ డైవర్షన్ చేస్తున్నారు- స్పీకర్
అసెంబ్లీ దగ్గర నిన్న జరిగిన ఘటనపై సభలో క్షమాపణ చెబుతారని అనుకున్నానని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. చిట్‌చాట్‌లో మాట్లాడిన ఆయన.. వాస్తవానికి మైక్ ఇవ్వద్దు.. తాను స్పీకర్‌గా నాలుగు వైపుల...
- Advertisement -
- Advertisement -


