బీబీసీ.. బ్రిటీష్ బ్రాడ్ క్యాస్టింగ్ కార్పొరేషన్ ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమైంది. వచ్చే వారంలో న్యూస్ డిపార్ట్‌మెంట్‌తో సహా వందల మంది ఉద్యోగులకు ఉద్వాసన పలకనుందని ఫైనాన్షియల్ టైమ్స్ వెల్లడించింది. భవిష్యత్ నిధుల అంశంపై ప్రభుత్వ మంత్రులతో జరగనున్న చర్చలకు ముందుగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
బీబీసీలో మొత్తం 20వేల మందికి పైగా సిబ్బంది ఉన్నారు. బీబీసీ తన మొత్తం వ్యయాల్లో దాదాపు 10 శాతం కోత విధించనుంది. దీని ఫలితంగా సుమారు 2వేల ఉద్యోగాలు కోల్పోయే అవకాశం ఉంది. మొత్తం సిబ్బందిలో నాలుగో వంతు మంది పనిచేస్తున్న వార్తా విభాగమే వచ్చే వారం మొదటగా తన ప్రణాళికను ప్రకటించనుంది.


