వికారాబాద్‌లో పోలీసుల దాష్టీకం వెలుగు చూసింది. తనకు న్యాయం కావాలంటూ ఆశ్రయించిన ఫిర్యాదుదారుడిని చితకబాదారు. దోమ మండలం దిర్సంపల్లి తాండాకు చెందిన రుక్కుబాయి, సంతోష్ లకు వారి దాయాదుల మధ్య భూవివాదం జరిగింది. దీంతో తమకు న్యాయం చేయాలంటూ పోలీసుల ను ఆశ్రయించారు రుక్కుబాయి, సంతోష్. అనంతరం తాము పెట్టిన కేసుపై ఎలాంటి చర్యలు తీసుకు న్నారని అడిగేందుకు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లిన సంతోష్ అప్‌డేట్‌పై ఆరా తీశాడు. అయితే ఫిర్యాదు చేసిన వారిని కూడా పీఎస్‌కు పిలిపించి రాజీ కోసం ఇరువురు మాట్లాడుకోమని సమయం ఇచ్చారు ఎస్సై. ఈ క్రయంలో ఇరువురి మధ్య మళ్లీ వివాదం చోటు చేసుకుంది. మాటామాటా పెరిగి ఒకరిపై ఒకరు పోలీస్ ఆవరణలోనే దాడికి దిగారు. దీంతో వారిని అడుకున్న పోలీసులు అందరినీ మందలించి తనను మాత్రం ఎస్సైతోపాటు కానిస్టేబుళ్లు విచక్షణారహంతగా చితకబాదారని ఆరోపిస్తున్నాడు సంతోష్. ఆరోగ్యం బాగా లేదని చెప్పినా వినకుండా కొట్టారని ఆవేదన వ్యక్తం చేశాడు. న్యాయం కోసం వస్తే తనను చితకబాద డమేంటని ప్రశ్నిస్తున్నాడు. తన పట్ల దురుసుగా వ్యవహరించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాడు సంతోష్.
వికారాబాద్ జిల్లాలో పోలీసుల దాష్టీకం
0
218
Previous article
Latest Articles
కళ్యాణ్ రామ్.. ప్లాప్ డైరెక్టర్ కి ఓకే చెప్పాడా..?
నందమూరి కళ్యాణ్ రామ్.. బింబిసార మూవీతో బ్లాక్ బస్టర్ సాధించిన తర్వాత చేసిన సినిమాలు ఏమాత్రం ఆకట్టుకోలేదు. ఇప్పుడు వెంకీతో కలిసి హిట్ మిషన్ అనిల్ రావిపూడి డైరెక్షన్లో.. చేస్తున్న క్రేజీ మల్టీస్టారర్...
- Advertisement -
- Advertisement -


