నీట్ ప్రశ్నపత్రం లీకేజి అంశం పార్లమెంట్ ఉభయసభలను కుదిపేశాయి. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల మూడో రోజు కూడా వాయిదాల పర్వం కొనసాగింది. నీట్ అంశంపై చర్చించాలని, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ విపక్షాలు లోక్‌సభలో ఆందోళన కొనసాగించాయి. దీంతో ఉదయం నుంచి మూడు సార్లు వాయిదా అనంతరం లోక్‌సభ రేపటికి వాయిదా పడింది.
రాజ్యసభలోనూ సేమ్ సీన్ రిపీట్ అయింది. పెద్దల సభలో కేంద్ర మంత్రి జేపీ నడ్డా కీలక ప్రకటన చేశారు. నీట్ అంశంపై చర్చించడానికి కేంద్రం సిద్ధంగా ఉందని తెలిపారు. అయితే ధర్మేంద్ర ప్రదాన్ రాజీనామా చేస్తేనే తాము చర్చకు అంగీకరిస్తామని ఖర్గే స్పష్టం చేశారు.


