హైదరాబాద్ రవీంద్ర భారతిలో ప్లానింగ్ డిపార్ట్‌మెంట్ ఆధ్వర్యంలో ‘ఎల్ నినో – తెలంగాణ సన్నాహకత’ సదస్సు జరిగింది. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి మహమ్మద్ అజహరుద్దీన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. ఎల్ నినో ప్రభావంతో వర్షాలు తగ్గితే జల విద్యుత్ ఉత్పత్తి పడిపోయి విద్యుత్ డిమాండ్ విపరీతంగా పెరుగుతుందన్నారు. ప్రస్తుతం వర్షాకాలంలోనూ ఏప్రిల్ నాటి పీక్ డిమాండ్ నమోదవుతోందని తెలిపారు. ఆర్థిక భారం తగ్గించుకునేందుకు రైతులు, ప్రజలు పగటిపూట లభించే చౌకైన సోలార్ విద్యుత్‌ను గరిష్టంగా వినియోగించుకోవాలని సూచించారు. అనంతరం మంత్రి అజహరుద్దీన్ మాట్లాడుతూ.. ఎల్ నినో సవాళ్లను ఎదుర్కొనేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలని పిలుపునిచ్చారు.
రవీంద్ర భారతిలో ‘ఎల్ నినో – తెలంగాణ సన్నాహకత’ సదస్సు
0
55
Previous article
Next article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


