మల్లారెడ్డిపై వేటు తప్పదా?

మాజీ మంత్రి మల్లారెడ్డి వ్యవహారం వివాదాస్పదంగా మారుతోందా…? మల్లారెడ్డి వైఖరిపై బిఆర్ఎస్ క్యాడర్ ఆగ్రహంతో ఉందా.? మల్లారెడ్డిపై వేటు వేయాలని గులాబీ అధిష్టానంపై ఒత్తిడి పెరుగుతోందా…? ఇంతకు మల్లారెడ్డి ఆగ్రహానికి గురి కావడానికి కారణం ఏమిటి…? గులాబీ పార్టీ వర్గాల్లో ఏం చర్చ జరుగుతోంది…?

నిత్యం ఏదో ఒక సందర్భంలో వార్తల్లో ఉండే మాజీ మంత్రి మల్లారెడ్డి వ్యవహారం మరోసారి హాట్ టాపిక్ గా మారింది. తాజాగా సీఎం రేవంత్ రెడ్డి సభలో మల్లారెడ్డి పాల్గొనడంపై బిఆర్ఎస్ శ్రేణులు ఆగ్రహంతో ఉన్నాయి. తాను ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న మేడ్చల్ నియోజకవర్గంలో తెలంగాణ కవి అందెశ్రీ జయంతి సందర్భంగా స్మృతి వనం కార్యక్రమం నిర్వహించారు. దీంతో ప్రొటోకాల్ ప్రకారం స్థానిక ఎమ్మెల్యే హోదాలో మల్లారెడ్డి హాజరయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడే సభలో పాల్గొన్నారు. అసలు సమస్య ఇక్కడే వచ్చింది. సీఎం రేవంత్ రెడ్డి తన ప్రసంగంలో కేసీఆర్ కుటుంబం టార్గెట్ గా తీవ్ర విమర్శలు చేశారు.

ఇక సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ ను టార్గెట్ చేసి మాట్లాడుతున్నప్పుడు బిఆర్ఎస్ ఎమ్మెల్యేగా స్టేజి పైనే ఉన్న మల్లారెడ్డి ఎందుకు అభ్యంతరం చెప్పలేదని గులాబీ పార్టీ వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. అంతే కాదు ఆ సమయంలో మల్లారెడ్డి స్టేజి దిగి వెళ్లిపోయి తన నిరసన తెలపాల్సింది పోయి సమర్ధించే విధంగా స్టేజీ పైనే కూర్చోవడం వివాదంగా మారింది. ఇప్పుడు ఈ అంశం పొలిటికల్ సర్కిల్స్ లో చర్చకు దారి తీసింది. మల్లారెడ్డి కావాలనే సీఎం రేవంత్ రెడ్డి మీటింగ్ కు వచ్చారా లేక స్థానిక ఎమ్మెల్యేగా హాజరై సభలో పాల్గొన్నారా అనే దానిపై ఆరా తీస్తున్నాయి. ఈ పరిణామం తర్వాత మాజీ మంత్రి మల్లారెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలనే డిమాండ్ పెరుగుతోంది. క్యాడర్ నుంచే కాకుండా పార్టీ నేతల నుంచి సైతం వినిపిస్తోంది.

మాజీ మంత్రి మల్లారెడ్డి గత కొద్ది రోజులుగా బిఆర్ఎస్ పార్టీకి దూరంగా ఉంటూ వస్తున్నారు. మేడ్చల్ నియోజకవర్గంలో ఇప్పటి వరకు SIR, సభ్యత్వ నమోదుపై జనరల్ బాడీ మీటింగ్ పెట్టలేదు. దీనికి ఇటీవల కాలంలో మల్లారెడ్డి వ్యవహార శైలి ప్రధాన కారణమని పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఆ తర్వాత ఒక కార్యకర్త బర్త్ డే వేడుకల్లో పాల్గొన్న మాజీ మంత్రి మల్లారెడ్డి బిఆర్ఎస్ పార్టీకి దూరం అవుతున్నానని.. తనను పట్టించుకోవడం లేదా అంటూ కామెంట్స్ చేశారు. ఈ కామెంట్స్ సైతం వైరల్ అయ్యాయి. తాజాగా మల్లారెడ్డి సీఎం సభలో పాల్గొన్న రోజునే సరూర్ నగర్ స్టేడియం లో బిఆర్ఎస్ పార్టీ యువ సంగ్రామ సదస్సు నిర్వహించింది. ఈ సభకు సిటీలో ఉన్న మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. కానీ మల్లారెడ్డి మాత్రం డుమ్మా కొట్టారు. సాయంత్రం సీఎం ప్రోగ్రామ్ లో పాల్గొన్నారు. దీంతో పార్టీ ప్రోగ్రామ్ కు రాకుండా సీఎం సభకు వెళ్లడంపై గులాబీ అధిష్టానం సైతం ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ అంశాన్ని బిఆర్ఎస్ అధిష్టానం నిశితంగా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.

బిఆర్ఎస్ పార్టీ 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయింది. కానీ మాజీ మంత్రి మల్లారెడ్డి మేడ్చల్ నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మల్లారెడ్డి విద్యా సంస్థలను టార్గెట్ చేస్తూ రేవంత్ రెడ్డి యాక్షన్ ప్లాన్ షురూ చేశారు. దీంతో మల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి జంప్ చేయడం ఖాయం అంటూ ప్రచారం జరిగింది. అదే సమయంలో మల్లారెడ్డి తన కుమారులతో
కలిసి బెంగుళూరు వెళ్లి ప్రస్తుత కర్ణాటక సీఎం డి.కె.శివకుమార్ తో భేటీ అయ్యారు. మరో వైపు మల్లారెడ్డి కోడలు ప్రీతి రెడ్డి ఢిల్లీ వెళ్లి బీజేపీ అగ్ర నేతలతో భేటీ అయ్యారు. బీజేపీలో చేరి వచ్చే ఎన్నికల్లో ఎంపీ లేదా ఎమ్మెల్యేగా పోటీ చేస్తారని చర్చ జరిగింది. హైదరాబాద్ లో బీజేపీ ఆఫీస్ కు సైతం ప్రీతి రెడ్డి వెళ్లారు. దేశ వ్యాప్తంగా తన ప్రైవేటు యూనివర్సిటీలు, విద్యా, వ్యాపార సంస్థలను విస్తరించాలని భావిస్తున్న మల్లారెడ్డి బీజేపీలోకి వెళ్తారని గత కొంత కాలంగా చర్చ నడుస్తోంది. తాజాగా సీఎం సభలో మల్లారెడ్డి పాల్గొనడం సీఎం కేసీఆర్ ను టార్గెట్ చేస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేయడంతో అక్కడే ఉన్న మల్లారెడ్డి ఆగ్రహానికి గురి కావాల్సి వచ్చింది.

మొత్తానికి తాజా ఎపిసోడ్ తో మల్లారెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని పార్టీ కార్యకర్తలు, క్యాడర్ నుంచి అధిష్టానంపై ఒత్తిడి పెరుగుతోంది. దీంతో మల్లారెడ్డి అంశంలో బిఆర్ఎస్ పార్టీ అధి నాయకత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

Latest Articles

జెత్వానీ కేసులో కూటమి సర్కార్‌కు షాక్‌

ముంబై నటి కాదంబరి జెత్వానీ కేసులో కూటమి సర్కార్‌కు షాక్‌ తగిలింది. సీఐడీ స‌మ‌ర్పించిన చార్జిషీట్‌లో దిమ్మ‌తిరిగే వాస్త‌వాలు బయటకు వచ్చాయి. జెత్వానే అతి పెద్ద బ్లాక్‌మెయిల‌ర్ అని సీఐడీ తేల్చింది. విజయ‌వాడ...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్