ఫౌజీ వస్తున్నాడు.. మరి.. బాలయ్య..?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న భారీ, క్రేజీ మూవీ ఫౌజీ. హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న ఈ సినిమా రిలీజ్ ఎప్పుడు అనేది ఇన్ని రోజులు సస్పెన్స్ గా ఉండేది. ఇప్పుడు డిసెంబర్ 3న ఫౌజీ వస్తుందని క్లారిటీ వచ్చేసింది. ఇదిలా ఉంటే.. నందమూరి నట సింహం బాలయ్య మూవీ కూడా డిసెంబర్ ఫస్ట్ వీక్లోనే రానున్నట్టుగా ఇండస్ట్రీలో టాక్ వినిపించింది. ఇప్పుడు డిసెంబర్ 3న ఫౌజీ వస్తుండడంతో.. బాలయ్య సినిమా వచ్చేది ఎప్పుడు అనేది ఆసక్తిగా మారింది. ఇంతకీ.. బాలయ్య మూవీ వచ్చేది ఎప్పుడు..?

ఫౌజీ సినిమా ఆగష్టులో రావాలి.. ఆతర్వాత అక్టోబర్ అని వార్తలు వచ్చాయి. రీసెంట్ గా డిసెంబర్ ఫస్ట్ వీక్లో రానుంది అంటూ ప్రచారం జరిగింది. ప్రచారంలో ఉన్నట్టుగానే డిసెంబర్ 3న ఫౌజీ రాబోతుందని అఫీషియల్ గా కన్ ఫర్మ్ చేశారు మేకర్స్. ఫౌజీ చాలా పెద్ద స్కేల్ లో తీస్తున్న సినిమా. అందుకే.. ఈ మూవీ విడుద‌ల ఆల‌స్యం అవుతూ వ‌చ్చింది. హ‌ను రాఘవపూడి మేకింగ్ స్టైల్ గురించి తెలిసిన‌వాళ్లంతా డిసెంబర్లో వస్తుందని ప్రచారం జరిగినా.. రాకపోవచ్చు అనుకున్నారు. అయితే.. చివ‌రికి డిసెంబ‌రు 3న ఫౌజీని విడుద‌ల చేస్తామని ప్రకటించారు.

ఫౌజీ పోస్టర్ లో.. ప్రభాస్ చొక్కా లేకుండా యుద్ధభూమిలో వందలాది శవాల మధ్య తుపాకీ పట్టుకుని వర్షంలో తడుస్తున్నట్టుగా ఉన్న లుక్ చాలా ఇంటెన్స్ గా ఉంది. ఇన్ సైడ్ టాక్ ప్రకారం ప్రభాస్ ఇందులో బ్రాహ్మణ సైనికుడిగా నటిస్తున్నాడు. అది కూడా బ్రిటిష్ సైన్యంలో. అలా ఎందుకు చేశాడు, సుభాష్ చంద్ర బోస్ లాంటి ఫ్రీడమ్ ఫైటర్స్ తో తనకున్న సంబంధం ఏంటనేది 1932 బ్యాక్ డ్రాప్ లో చూపించబోతున్నారని తెలియడంతో ఫౌజీ మూవీ పై మరింత ఆసక్తి ఏర్పడింది.

ఇక బాలయ్య విషయానికి వస్తే.. మలినేని గోపీచంద్ తో భారీ చిత్రం చేస్తున్నారు. బాలయ్య, మలినేని గోపీచంద్.. ఈ ఇద్దరి కలయికలో వీరసింహారెడ్డి అనే సినిమా రూపొందడం.. బ్లాక్ బస్టర్ సాధించడంతో లేటెస్ట్ మూవీ పై మరింత బజ్ క్రియేట్ అయ్యింది. ఈ సినిమా అసలు దసరాకి వస్తుంది అనుకున్నారు. ఆతర్వాత డిసెంబర్ ఫస్ట్ వీక్లో డిసెంబర్ 4న రాబోతుందని వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఫౌజీ డిసెంబర్ 3న వస్తుండడంతో బాలయ్య మూవీ ప్లాన్ మారిందని తెలిసింది. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న రాబోతుందనేది ఇన్ సైడ్ న్యూస్. మరి.. ఈసారి బాలయ్య, మలినేని కలిసి ఏ రేంజ్ సక్సెస్ సాధిస్తారో చూడాలి.

Latest Articles

బీఆర్‌ఎస్‌ సభకు తెలంగాణ హైకోర్టు అనుమతి

బీఆర్‌ఎస్‌ సభకు తెలంగాణ హైకోర్టు అనుమతి ఇచ్చింది. రేపు సరూర్‌నగర్‌లో BRS యువ సంగ్రామ సభను నిర్వహించాలని తలపెట్టింది. సభకు అనుమతించాలని కోరుతూ తెలంగాణ హైకోర్టులో బీఆర్ఎస్‌ పిటిషన్‌ దాఖలు చేసింది. దీనిపై...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్