శ్రీకాకుళం అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలోని ప్రాచీన చారిత్రక ఆలయాలన్నీ విడతల వారీగా అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. భక్తులకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తామని ఎమ్మెల్యే చెప్పారు. శ్రీకాకుళంలోని దాదాపు 500 ఏళ్ల చరిత్ర గల బలగ భద్రమ్మ తల్లి ఆలయాన్ని శంకర్ దర్శించు కున్నారు. నాగావళినది ఒడ్డున ఉండి శ్రీకాకుళం ప్రజలు ఇలవేల్పుగా పూజిస్తున్న భద్రమ్మ తల్లి ఆలయా న్ని అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. శ్రీకూర్మం, అరసవల్లి, ఉమా రుద్రకోటేశ్వర, కల్లేపల్లి, కళింగ పట్నం మదీనాబాబా ఆలయాలు పర్యాటకంగా, ఆధ్యాత్మికంగా అగ్రస్థానంలో నిలుపుతానని ఎమ్మెల్యే చెప్పారు.