నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామినేషన్ నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లను కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పరిశీలించారు. మంగళవారం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) ప్రధాన కార్యాలయంలో అధికారులతో సమావేశమయ్యారు. పరీక్షకు సంబంధించిన ఏర్పాట్లను ఆయన సమీక్షించారు. జూన్ 21న నీట్ ఎగ్జామ్ జరగనుంది. పరీక్షను సజావుగా, ఎలాంటి అవాంతరాలు లేకుండా నిర్వహించేందుకు కేంద్ర ఆరోగ్యశాఖ సహకారం కోరుతూ కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డాతో కూడా ధర్మేంద్ర ప్రధాన్ సమావేశం కానున్నట్లు సమాచారం. సమీక్షా సమావేశం అనంతరం విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో ఉన్న ఆందోళనలను తొలగించే ప్రయత్నం చేశారు. పరీక్ష నిర్వహణపై పూర్తి నమ్మకం కల్పించారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు హామీ ఇచ్చారు. నీట్ యూజీ 2026 రీ-పరీక్షను ఎలాంటి లోపాలు, అవకతవకలు లేకుండా నిర్వహిస్తామని ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు. జూన్ 21న మధ్యాహ్నం 2 గంటల నుంచి 5.15 గంటల వరకు నీట్ ఎగ్జామ్ జరగనుంది.
ఎలాంటి అవాంతరాలు లేకుండా నీట్ రీ ఎగ్జామ్‌ను నిర్వహిస్తాం- ధర్మేంద్ర ప్రధాన్
0
60
Previous article
Next article
Latest Articles
విజయసాయిరెడ్డి లక్ష్యం నెరవేరేనా?
ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖచిత్రంపై మూడో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగేందుకు మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి సిద్ధమయ్యారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో అత్యంత కీలక నేతగా వ్యవహరించిన ఆయన, ఇప్పుడు ఆ పార్టీకి పూర్తిగా...
- Advertisement -
- Advertisement -


