న్యూ రికార్డ్ సెట్ చేస్తున్న డార్లింగ్ ప్రభాస్..

నిండు చంద్రుడు ఒక వైపు.. చుక్కలు ఒక వైపు.. నేను ఒక్కడిని ఒక వైపు.. లోకం ఒక వైపు అన్నట్టుగా.. హీరోలందరూ ఒక వైపు.. ప్రభాస్ ఒక వైపు అని చెప్పచ్చు. మేటర్ ఏంటంటే.. ఏమాత్రం గ్యాప్ లేకుండా.. ఒకేసారి రెండు, మూడు సినిమాలు చేస్తున్న ఈ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఇప్పుడు సరికొత్త రికార్డ్ సెట్ చేయబోతున్నాడని వార్తలు వస్తున్నాయి. ఇంతకీ.. డార్లింగ్ ప్రభాస్ సెట్ చేసే న్యూ రికార్డ్ ఏంటి..?

చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్.. ఈ స్టార్ హీరోలు సంవత్సరానికి మూడు సినిమాలు ఖచ్చితంగా రిలీజ్ చేసేవారు. సీనియర్ హీరోలు ఎన్టీఆర్, ఎఎన్ఆర్, కృష్ణ అయితే.. అంతకు మించి ఎక్కువ సినిమాలు రిలీజ్ చేసేవారు. సూపర్ స్టార్ కృష్ణ అయితే.. 1972లో 18 సినిమాలు రిలీజ్ చేశారు. ఇది ఇండియన్ సినిమాల్లోనే రికార్డ్ గా నిలిచింది. అయితే.. ఆతర్వాత మన స్టార్ హీరోలు సంవత్సరానికి ఒక సినిమా రిలీజ్ చేయడమే కష్టంగా మారిపోయింది. పవన్ కళ్యాణ్, మహేష్‌ బాబు, అల్లు అర్జున్, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్.. తదితర హీరోల నుంచి సంవత్సరానికి ఒక సినిమా కూడా రావడం లేదు. రెండేళ్లు మినిమమ్ టైంగా మారిపోయింది.

ప్రభాస్ మాత్రం.. సంవత్సరానికి ఒకటి కాదు.. రెండు సినిమాలు రిలీజ్ చేస్తానని అభిమానులకు మాట ఇచ్చాడు. ఇచ్చిన మాట ప్రకారం.. రెండు సినిమాలను రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నాడు. డిసెంబర్ 3న ప్రభాస్ ఫౌజీ మూవీ వస్తుంది. ఈ సినిమా రిలీజ్ విషయంలో ఎలాంటి అనుమానం లేదు. రిలీజ్ కావడం కన్ఫర్మ్ అయ్యింది. టైం తక్కువగా ఉన్నప్పటికీ దర్శకుడు హను రాఘవపూడి రెండు యూనిట్లతో వర్క్ చేయిస్తున్నారు. మైత్రి టీమ్ కూడా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఎక్కడా బ్రేక్ రాకుండా చూసుకుంటోంది. బాలీవుడ్, ఓవర్సీస్ మార్కెట్ పరంగా అన్నింటికి అదే అనువైన తేదీ కావడంతో ఎట్టి పరిస్థితుల్లోనూ డిసెంబర్ 3న ఫౌజీ రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యారు.

ఫౌజీ రిలీజైన మూడు నెలలకు మార్చి 5న స్పిరిట్ మూవీ రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే స్పిరిట్ మూవీ నలభై శాతం షూటింగ్ పూర్తి చేసిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ఎక్కువ లొకేషన్స్, విఎఫ్ఎక్స్ హడావిడి లేకుండా యానిమల్ తరహాలో చాలా ఆర్గానిక్ గా తీస్తున్నారని సమాచారం. డిస్ట్రిబ్యూటర్స్ తో చర్చించిన తర్వాతే స్పిరిట్ మూవీ మార్చి 5న రిలీజ్ చేయనున్నట్టుగా అనౌన్స్ చేశారు. అంటే కేవలం మూడు నెలల గ్యాప్ లో రెండు భారీ పాన్ ఇండియా సినిమాలు ప్రభాస్ నుంచి వచ్చినట్టు అవుతుంది. రాజాసాబ్ నుంచి చూసుకుంటే.. 13 నెలల్లోనే మూడు పాన్ ఇండియా సినిమాలు రిలీజ్ చేయడం అంటే మామూలు విషయం కాదు. ఇది మిగిలిన హీరోలకు సాధ్యం కాదని.. ఇదొక రికార్డ్ కానుందని అంటున్నారు సినీ జనాలు. మరి.. ఫౌజీ, స్పిరిట్ సినిమాలతో రిలీజ్ కాకుండానే రికార్డ్ సెట్ చేస్తున్న ప్రభాస్.. రిలీజ్ తర్వాత బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి రికార్డులు సెట్ చేస్తాడో చూడాలి.

Latest Articles

శాఖల పనితీరుపై అధికారులకు సీఎం చంద్రబాబు క్లాస్

శాఖల పనితీరుపై అధికారులకు సీఎం చంద్రబాబు క్లాస్ తీసుకున్నారు. 2024 ఎన్నికల్లో ప్రజలు చారిత్రక తీర్పు ఇచ్చారని అన్నారు. ఈ తీర్పును అధికారులు కూడా గౌరవించాలని చెప్పారు. 2029లో 2024 కంటే ఎక్కువ...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్