ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో తెలంగాణ ఆర్‌అండ్‌బీ ఈఎన్సీ మోహన్ నాయక్ ను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. అనంతరం హైదరాబాద్‌లోని ఎస్‌పీఈ అండ్ ఏసీబీ కేసుల ప్రత్యేక న్యాయమూర్తి ఎదుట హాజరుపరచగా, కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. దీనితో ఆయన్ను చంచల్‌గూడ జైలుకు తరలించారు. ఈ కేసుకు సంబంధించి హైదరాబాద్, నిజామాబాద్ సహా రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 17 చోట్ల ఏసీబీ అధికారులు ఏకకాలంలో తనిఖీలు చేపట్టారు. సోదాల్లో భాగంగా మోహన్ నాయక్ నివాసం, కార్యాలయాల నుండి సుమారు 65 లక్షల నగదు, 1.5 కేజీల బరువు గల 15 బంగారు బిస్కెట్లు, వెండి ఆభరణాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మొత్తంగా స్వాధీనం చేసుకున్న ఆస్తుల విలువ 200 కోట్లకు పైనే ఉంది.
మోహన్ నాయక్ కు 14 రోజుల రిమాండ్
0
44
Previous article
Next article
Latest Articles
సికింద్రాబాద్ యశోదా ఆస్పత్రికి కేసీఆర్.. పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిపై ఆరా
సికింద్రాబాద్ యశోదా ఆస్పత్రికి మాజీ సీఎం కేసీఆర్ వచ్చారు. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించారు. అనంతరం డాక్టర్లతో మాట్లాడి పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య...
- Advertisement -
- Advertisement -


