పవర్ స్టార్.. ఇక సినిమాలు చేయరా..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌.. ఓజీ సినిమాతో బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించిన తర్వాత.. నెక్ట్స్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసారు కానీ.. ఇంత వరుకు పట్టాలెక్కలేదు. అలాగే ఓజీ సీక్వెల్ ఉందని హింట్ ఇచ్చారు కానీ.. దీని గురించి కూడా ఎలాంటి అప్ డేట్ ఇవ్వలేదు. ఇప్పుడు పొలిటికల్ గా మరింతగా బిజీ అవ్వడంతో.. పవర్ స్టార్ ఇక సినిమాలు చేస్తారా..? చేయరా..? అనే చర్చ మళ్లీ మొదలైంది. ఇంతకీ.. పవన్ కొత్త సినిమాల అప్ డేట్స్ ఇవ్వకపోవడానికి అస్సలు కారణం ఏంటి..? క్లారిటీ వచ్చేది ఎప్పుడు..?

వీరమల్లు, ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్.. ఈ మూడు సినిమాలు ప్రేక్షకుల ముందుకు రావడం.. ఇందులో ఓజీ బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించడం తెలిసిందే. అయితే.. ఆతర్వాత స్టైలీష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డితో సినిమా చేయనున్నట్టుగా అనౌన్స్ చేశారు కానీ.. ఈ క్రేజీ ప్రాజెక్ట్ కు సంబంధించి ఎలాంటి అప్ డేట్ ఇంత వరుకు రాలేదు. ఇదిలా ఉంటే.. ఇప్పుడు పవర్ స్టార్ పూర్తిగా పాలిటిక్స్ పైనే దృష్టి పెట్టినట్టు కనిపిస్తోంది. దీంతో పవన్ కళ్యాణ్ నుంచి రానున్న సినిమాల గురించి జనాల్లో ఆసక్తి పెరుగుతున్నా.. ఎలాంటి క్లారిటీ మాత్రం రావడం లేదు. దీంతో పొలిటికల్ గా ఇంత బిజీలో సినిమాలు చేస్తారా..? చేయరా..? అనేది ఆసక్తిగా మారింది.

వక్కంతం వంశీ కథతో సురేందర్ రెడ్డి తెరకెక్కించే మూవీ ఉగాది తర్వాత రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానుందని ప్రచారం జరిగింది. హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్‌ గా తెరకెక్కనుందని వార్తలు వచ్చాయి. అయితే.. ఆ అనౌన్స్మెంట్ తర్వాత ప్రాజెక్టుకు సంబంధించి ఎలాంటి అప్ డేట్ ఇవ్వలేదు. మరో వైపు సుజీత్ దర్శకత్వంలో వచ్చిన ఓజీ బ్లాక్ బస్టర్ అవ్వడంతో.. ఓజీ సీక్వెల్ పై మరింత క్రేజ్ ఏర్పడింది. సుజిత్ నానితో చేయాల్సిన మూవీ ఇంకా స్టార్ట్ కాలేదు. దీంతో ఓజీ సీక్వెల్ పై సుజిత్ వర్క్ చేస్తున్నారని ప్రచారం అయితే జరుగుతుంది కానీ.. ఎప్పుడు పట్టాలెక్కుతుంది అనేది మాత్రం క్లారిటీ లేదు.

వీరమల్లు సీక్వెల్ ఉంటుందని ప్రకటించారు కానీ.. ఈ సీక్వెల్ ఇక లేనట్టే అనేది ఇండస్ట్రీ ఇన్ సైడ్ న్యూస్. ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీతో కలిసి పవన్ కళ్యాణ్ వరుసగా సినిమాలు నిర్మించనున్నట్టుగా అనౌన్స్ చేశారు. అయితే.. ఈ అనౌన్స్ మెంట్ తర్వాత ఈ బ్యానర్ నుంచి ఒక్క సినిమా కూడా పట్టాలెక్కలేదు. ఇదిలా ఉంటే.. పవన్ తో సినిమాలు చేసేందుకు ప్రముఖ నిర్మాణ సంస్థలు మైత్రీ మూవీ మేకర్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, హారిక అండ్ హాసిని క్రియేషన్స్, ఎస్ ఆర్ టీ ఎంటర్ టైన్మెంట్స్ సంస్థలు.. రెడీగా ఉన్నాయి. కానీ.. పవన్ పాలిటిక్స్ లో బిజీగా ఉండడం వలన డేట్స్ ఇవ్వలేదు. అయితే.. ఇంత బిజీలో పవన్ సినిమాలు చేస్తారా.. అంటే డౌటే అంటున్నారు ఇండస్ట్రీ జనాలు. ఏది ఏమైనా.. పవన్ నెక్ట్స్ ప్రాజెక్టులు గురించి క్లారిటీ రావాలంటే.. కొన్ని రోజులు ఆగాల్సిందే.

Latest Articles

మల్కాజ్‌గిరి కార్పొరేషన్‌ భవన నిర్మాణానికి బ్రేక్‌

మల్కాజ్‌గిరి కార్పొరేషన్‌ భవన నిర్మాణానికి బ్రేక్‌ పడింది. భవన నిర్మాణానికి వ్యతిరేకంగా హైకోర్టులో 5 రిట్‌ పిటిషన్లు దాఖలయ్యాయి. ఇటీవల భవన నిర్మాణానికి సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. పిటిషన్లపై విచారించిన...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,200FansLike
31,700FollowersFollow
291FollowersFollow
421,815SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్