సింగరేణిని ప్రైవేటుపరం చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కుట్ర చేస్తున్నాయని సీఐటీయూ నేతలు ఆరోపించారు . కార్మిక, ప్రజావ్యతిరేక విధానాలను తిప్పికొట్టేందుకు కార్మికులు కలిసి రావాలని పిలుపుని చ్చారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో ప్రజాసంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం దిష్టి బొమ్మను దహనం చేశారు. దేశ సంపదను అదానీ, అంబానీలకు మోదీ ప్రభుత్వం దోచిపెడుతోందని సీఐటీయూ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలోని బొగ్గుగనులను సింగరేణి సంస్థకు అప్పగిం చాలని డిమాండ్ చేశారు. సింగరేణి ప్రైవేటీకరణకు నిరసనగా ఆందోళనలు ఉధృతం చేస్తామని సీఐటీయూ నేతలు హెచ్చరించారు.