33.8 C
Hyderabad
Monday, April 28, 2025
spot_img

క్లియర్‌టెల్లిజెన్స్ ఆపరేషన్స్ సెంటర్‌ను ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు

ఉగాది తర్వాత మహేశ్వరంలో AI సిటీ నిర్మాణానికి భూమి పూజ చేయనున్నట్లు… IT, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు. రాయదుర్గం నాలెడ్జ్ సిటీలోని ఓ హోటల్ లో క్లియర్ టెల్లిజెన్స్ ఇండియా సంస్థ డెలవరీ అండ్ ఆపరేషన్స్ సెంటర్ను… ఆ సంస్థ సీఈవో ఒవెన్ ఫ్రివోల్డ్, మేనేజింగ్ పాట్నర్ అనిల్ భరద్వతో కలిసి… మంత్రి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా క్లియర్ టెల్లిజెన్స్ సంస్థ తమ శాఖను హైదరాబాద్ లో ఏర్పాటు చేయడం పట్ల…శ్రీధర్ బాబు హర్షం వ్యక్తం చేశారు. డేటా అనలిటిక్స్, సైబర్ సెక్యూరిటీ వంటి పురోగతి సాధిస్తున్న సాంకేతికతల్లో ఇప్పటికే సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్ కేంద్రాలు ప్రారంభించినట్లు మంత్రి తెలిపారు.

సీఈవో ఒవెన్‌ ఫ్రీవోల్డ్‌ మాట్లాడుతూ ‘‘క్లియర్‌టెలిజన్స్‌ అఫీషియల్‌గా ఇంటర్నేషనల్‌ ఆఫీస్‌ ప్రారంభించినందుకు చాలా ఆనందంగా ఉంది.ఆది కూడా హైదరాబాద్‌ లాంటి ఒక వైబ్రెంట్‌ సిటీ …ఆత్బుతంగా అభివృద్ది చెందుతున్న సిటీలో ప్రారంభించడం ఏంతో సంతోషం.ఐటీ శాఖా మంత్రికి , తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వానికి ధన్వవాదనలు. తెలంగాణా ప్రభుత్వం సహకారం మరియు గైడెన్స్‌తోనే ఇది సాధ్యపడింది.మా ఈ కంపెనీ పీపుల్‌ ఫస్ట్‌ ఆప్రోచ్‌ తో పనిచేస్తుంది.ఈ మా ప్రయాణం ఇప్పుడే మొదలైంది.ఇవాళ 50 మందితో ప్రారంభమైన ఇండియా డవలెప్‌మెంట్‌ సెంటర్‌ వందల సంఖ్యలో ఉద్వోగాల లక్ష్యంతో ముందుకు వెళుతుంది. త్వరలోనే కంపినీ భహుళ అంతస్తుల భవనం నిర్మించే దశకు చేరుకోవడమే మా లక్ష్యం.’’ అని అన్నారు.

కో ఫౌండర్‌ & మేనిజింగ్‌ పార్టనర్‌ అనీల్‌ భరద్వ మాట్లాడుతూ ‘‘ముందుగా రేవంత్‌ రెడ్డి ప్రభుత్వానికి ధన్వవాదలను తెలుపుతున్నాను.హైదరాబాద్‌ గ్లోబుల్‌ టేక్నాలజీ పవర్‌ హౌస్‌గా మార్చడంలో ప్రధాన భూమికను ఫోషిస్తున్న ఐటీ మంత్రి శ్రీధర్‌ బాబు గారు అందించిన సహకారానికి ప్రత్యేక ధన్యవాదాలు ఫ్యూచర్ సిటీ, ఫోర్త్‌ సిటీ ప్రఫాళికలు మమ్మల్ని ఆశ్చర్యపరుస్తున్నాయి. ఈ టెక్నాలజీ తో ముడిపడి ఉన్న ఈ నగరంలో మా ఈ క్లియర్‌టెలిజన్స్‌ భాగస్వామి అవ్వడానికి ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తుందని బలంగా నమ్ముతున్నాను.’’ అని అన్నారు.

ఎంఎం ఇన్ఫో టెక్నాలజీస్ ఫౌండర్ మురళి మాట్లాడుతూ ‘‘క్లియర్‌టెలిజన్స్ ఇండియాలో ఏ ప్రాంతంలో మా కంపెనీ స్టార్ట్‌చేస్తే బాగుంటింది అని నన్ను సంప్రదించినప్పుడు ఓ తెలంగాణా బిడ్డగా హైదరాబాద్‌ ను రికమండ్‌ చేసాను. వాళ్లవంతు రీచర్చ్‌లో భాగంగా బెంగుళూరు వెళ్ళారు, కానీ హైదరాబాద్‌ నే ఎంచుకున్నారు . దానికి ప్రధాన కారణం తెలంగాణా ప్రభుత్వం క్రియేట్‌ చేసిన ఎకో సిస్టం.
ప్రథానంగా ఐటీ మంత్రి శ్రీధర్‌ బాబు గారు కొత్త కంపెనీలకు ఇస్తున్న సహాకారం నన్ను ఆశ్చర్యపరిచింది. మంత్రిగారికి నా ప్రత్యేక కృతజ్జతలు తెలియజేస్తున్నాను. ఓవెన్‌ చెప్పినట్టు ఇది జస్ట్‌ లాంచింగ్‌..దీని ద్వారా చాలా వందల మందికి ఉద్వోగ అవకాశాలు కలుగుతాయని విశ్వశిస్తున్నాను.’’ అని అన్నారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్