బాలయ్య బర్త్ డే.. ప్లాన్ అదిరింది..

నందమూరి బాలకృష్ణ స్పీడు మామూలుగా లేదు. ఓ వైపు సినిమాలు.. మరో వైపు రాజకీయాలు.. ఇంకో వైపు ఓటీటీలో.. అన్ స్టాపబుల్ అంటూ టాక్ షో.. ఇలా ఏమాత్రం గ్యాప్ లేకుండా ఫుల్ బిజీగా ఉన్నారు బాలయ్య. ఇప్పుడు మలినేని గోపీచంద్ తో చేస్తున్న సినిమా సెట్స్ పై ఉంటే.. కొరటాలతో సినిమాని పట్టాలెక్కించడానికి రెడీ అవుతున్నారు. ఇదిలా ఉంటే.. జూన్ 10న పుట్టినరోజు సందర్భంగా ఫ్యాన్స్ కి అదిరిపోయే ట్రీట్ ఇచ్చేందుకు ప్లాన్ రెడీ చేసారని.. ఈసారి ప్లాన్ అదిరింది అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు అభిమానులు. ఇంతకీ.. బాలయ్య బర్త్ డే ప్లాన్ ఏంటి..?

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం మలినేని గోపీచంద్ తో భారీ యాక్షన్ మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. బ్లాక్ బస్టర్ వీరసింహారెడ్డి కాంబోలో రూపొందుతోన్న మూవీ కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. ఇందులో బాలయ్య చాలా గ్యాప్ తర్వాత ఫుల్ లెన్త్ పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తారని టాక్. అలాగే గ్యాంగ్ స్టర్ గా కూడా కనిపించబోతున్నారని వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే.. ఈ మూవీకి సంబంధించి ప్రీ లుక్ పోస్టర్ రిలీజ్ చేసారు. ఈ పోస్టర్ మాత్రం ఊర మాస్ లెవెల్లో ఉందని ఫీడ్ బ్యాక్ వచ్చింది. ఈ పోస్టర్లో ఇనుప గొలుసులు చేత్తో పట్టుకొని బాలయ్య ఫుల్ యాక్షన్ మోడ్ లో కనిపిస్తుండడంతో మరింత బజ్ క్రియేట్ అయ్యింది. జూన్ 10న ఫుల్ పోస్టర్ రిలీజ్ చేయనున్నారు.

బ్లాక్ బస్టర్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో బాలయ్య నటించే యాక్షన్ ఎంటర్ టైనర్ తాలూకు అప్ డేట్ కూడా అదే రోజు ఇవ్వబోతున్నారని సమాచారం. ఆ క్రేజీ మూవీకి సంగీత దర్శకుడు ఎవరనేది రివీల్ చేస్తారని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. దీనికి సంబంధించిన అనౌన్స్ మెంట్ వీడియో వేరే లెవల్లో ఉంటుందని టాక్ వినిపిస్తోంది. ఈ రెండు సినిమాల అప్ డేట్స్ తో పాటు సర్ ఫ్రైజ్ కాంబో అనౌన్స్ మెంటు కూడా ఉంటుందని ప్రచారం జరుగుతుంది.

బాలయ్య పుట్టినరోజున కొత్త సినిమాల అప్ డేట్స్ తో పాటు పాత సినిమాలను కూడా రీ రిలీజ్ చేస్తుండడం ఆసక్తిగా మారింది. పాత సినిమాలు ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా మూడు సినిమాలు థియేటర్స్ లోకి కొత్తగా వచ్చేందుకు రెడీ అవుతున్నాయి. ఇంతకీ.. ఆ సినిమాలు ఏంటంటే.. భైరవద్వీపం, సమరసింహారెడ్డి, నరసింహనాయుడు. ఈ మూడు సినిమాలను జూన్ 10న రీ రిలీజ్ చేస్తుండడం విశేషం. బాలయ్య పుట్టినరోజున ఇన్నేసి గిఫ్టులు వస్తుండడంతో అభిమానుల ఆనందం మామూలుగా లేదు. అయితే.. బాలయ్య డ్రీమ్ ప్రాజెక్ట్ గురించి.. బాలయ్య నట వారసుడు మోక్షజ్ఞ ఎంట్రీ గురించి అభిమానులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. మరి.. పుట్టినరోజున బాలయ్య మోక్షజ్ఞ గురించి సర్ ఫ్రైజ్ అనౌన్స్ మెంట్ ఏదైనా ఇస్తారేమో చూడాలి.

Latest Articles

టీడీపీలో చంద్రబాబు జమానా ముగిసిందా?… నారా లోకేశ్ శకం మొదలయ్యిందా?

ఏపీ రాజకీయాల్లో అధికార తెలుగుదేశం పార్టీ తీసుకున్న తాజా నిర్ణయం సరికొత్త చర్చకు దారి తీసింది. ఖాళీ అయిన రాజ్యసభ స్థానాలకు అభ్యర్థుల ఎంపికలో పార్టీ అధిష్టానం అనూహ్య నిర్ణయం తీసుకుంది. దశాబ్దాలుగా...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,200FansLike
31,700FollowersFollow
291FollowersFollow
421,815SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్