విశాఖ స్టీల్ ప్లాంట్ లో ఒకే రోజు రెండు ప్రమాదాలు

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌లో జరిగిన ఘోర ప్రమాదంలో 8 మంది కార్మికులు మృతి చెందారు. మరో ఆరుగురు కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అరగంట ముందు SMS-2Aలోనూ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. ఒకే రోజు రెండు ఘటనలతో కార్మికుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. ప్రమాదాలపై సమగ్ర విచారణకు డిమాండ్‌ చేస్తున్నారు. బాధితులకు అత్యుత్తమ వైద్యం అందించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఘటనాస్థలాన్ని కేంద్ర మంత్రి కుమారస్వామి పరిశీలించారు.

మరోవైపు మృతుల కుటుంబాలను ఆదుకుంటామని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు హామీ ఇచ్చాయి. మృతుల కుటుంబాలకు ప్రధాని మోదీ ఆర్థిక సాయం ప్రకటించారు. మృతుల కుటుంబాలకు PMRFనుంచి రూ.2లక్షల చొప్పున, క్షతగాత్రులకు PMRFనుంచి రూ.50వేల చొప్పున సాయం ప్రకటించారు.

Latest Articles

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్