మృగశిర కార్తెను పురస్కరించుకుని ఈ నెల 8, 9 తేదీల్లో ఆస్తమా వ్యాధితో బాధపడే వారికి నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో చేప ప్రసాదం పంపిణీ జరగనుంది. చేపమందు ప్రసాద పనులను ప మంత్రి అజారుద్దీన్ పరీశించారు. వివిధ రాష్ట్రల నుండి వస్తున్న భక్తులకు ఎలాంటి సమస్యలు రాకుండా చూసుకోవాలని మంత్రి అజారుద్దీన్ అధికారులకు సూచించారు.
జలమండలి, జీహెచ్‌ఎంసీ, టీఎస్‌ఆర్టీసీ, ట్రాఫిక్ సహా వివిధ శాఖల అధికారులతో త్వరలోనే సమన్వయ కమిటీ సమావేశం జరగనుంది. చేప ప్రసాదం కోసం వచ్చే వారి భద్రతకు బందోబస్తు ఏర్పాట్లు చేయనున్నారు. నాంపల్లి, అజంతా గేట్, మాలకుంట, పరిసర ప్రాంతాలతో పాటు ఎగ్జిబిషన్ మైదానంలో సుమారు 600 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు.


