సంచలనం సృష్టించిన బెంగళూరులోని రామేశ్వరం కేఫ్ బాంబు పేలుడు ఘటనలో కీలక పరిణామం చోటుచేసు కుంది. బాంబు పేలుడు ఘటనకు సంబంధించిన నిందితుడు, ఉగ్రవాది ముస్సావిర్ హుస్సేన్ షాజిబ్‌ను జాతీయ దర్యాప్తు సంస్థ అరెస్టు చేసింది. ఈ కేసులో షాజిబ్ హుస్సన్ తో పాటు అబ్దుల్ మతీన్ అహ్మద్ ను కూడా కోల్‌కతాలో అరెస్టు చేశారు అధికారులు. తెలంగాణ, కేరళ, కర్నాటక పోలీసుల సహకారంతో నిందితులను అరెస్టు చేసినట్టు సమాచారం. ఈ కేసులో ముస్సావిర్ హుస్సేన్ షాజిబ్‌ను మాస్టర్ మైండ్ గా గుర్తించారు. బాంబు పేలుడు అనంతరం పరారీలో ఉన్న షాజిబ్‌ను ఎట్టకేలకు ఎన్‌ఐఏ అధికారులు పట్టుకున్నారు. పేలుళ్ల తర్వాత అతను అస్సాం, పశ్చిమ బెంగాల్‌లో తలదాచుకున్నట్లు ఇంటలిజెన్స్ వర్గాలు చెప్పాయి. మార్చి ఒకటో తేదీన బెంగళూర్‌లోని రామేశ్వరం కేఫ్ పేలుడు ఘటనలో 10 మంది గాయపడ్డారు. మాస్కు ధరించి వచ్చిన ఓ వ్యక్తి బాంబు ఉన్న బ్యాగును అక్కడే వదిలి వెళ్లిన వీడియోలు సీసీటీవీలో రికార్డయ్యాయి. పేలుడులో తక్కువ తీవ్రత ఉన్న ఐఈడీ వాడటంతో ప్రాణనష్టం తప్పింది. ఈ ఘటనలో నిందితుడిని పట్టుకునేందుకు ఎస్‌ఐఏ రంగంలోకి దిగి చివరకు అరెస్టు చేసింది.
బెంగళూరులోని రామేశ్వరం కేఫ్ ప్రధాన నిందితుల అరెస్ట్
0
347
Previous article
Latest Articles
రాష్ట్రాన్ని గతపాలకులు విచ్చలవిడిగా దోచుకున్నారు.. విజయ్ సంచలన ఆరోపణలు
రాష్ట్రాన్ని డీఎంకే, ఏఐఏడీఎంకే పార్టీలు విచ్చలవిడిగా దోచుకున్నాయంటూ సంచలన ఆరోపణలు చేశారు తమిళనాడు సీఎం విజయ్. టీవీకే పాలనలో ప్రభుత్వ కార్యాలయాల్లో లంచాలు ఉండవంటూ స్పష్టం చేశారు. కరూర్‌లో పర్యటించిన సీఎం.. తొక్కిసలాట...
- Advertisement -
- Advertisement -


