లెనిన్ కోసం నాగ్ మాస్టర్ ప్లాన్..

అక్కినేని అఖిల్ లెనిన్ మూవీ ఈ నెల 10న థియేటర్స్ లోకి వచ్చేందుకు రెడీ అయ్యింది. మురళీ కిషోర్ అబ్బూరు తెరకెక్కించిన లెనిన్ మూవీ పై అంచనాలు భారీగా ఉన్నాయి. టీజర్ అండ్ ట్రైలర్ కు ట్రెమండస్ రెస్పాన్స్ రావడంతో మరింత బజ్ క్రియేట్ అయ్యింది. ఇప్పుడు లెనిన్ కోసం యంగ్ టైగర్ రంగంలోకి దిగారు. ఈ మూవీకి ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ అందించారు. దీంతో డబుల్ బజ్ క్రియేట్ అయ్యింది. మరి.. నాగ్ మాస్టర్ ప్లాన్ వర్కవుట్ అయ్యేనా..?

అక్కినేని అఖిల్ నటించిన లెనిన్ మూవీ కోసం దాదాపు రెండేళ్లుగా వర్క్ చేసారు. ఏజెంట్ మూవీ డిజాస్టర్ అవ్వడంతో.. చాలా గ్యాప్ వచ్చింది. మూడేళ్ల తర్వాత అఖిల్ నుంచి సినిమా వస్తుండడంతో అక్కినేని అభిమానులు చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా పై చాలా ఆశలు పెట్టుకున్నారు. అయితే.. ఈ సినిమా అఖిల్ కెరీర్ కి చాలా అంటే చాలా కీలకం కావడంతో.. తెర వెనుక నాగార్జున అన్నీ తానై చూసుకున్నారు. కథ విని ఫైనల్ చేయడం దగ్గర నుంచి ఎడిటింగ్ రూమ్లో అవుట్ ఫుట్ చూసి మార్పులు చేర్పులు చెప్పడం.. రీషూట్స్ చేయించడం అన్నీ నాగ్ సలహా, సూచనల మేరకు జరిగాయి. ఇప్పుడు కంటెంట్ చూసుకుని టీమ్ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారని సమాచారం.

లెనిన్ మూవీని జనాల్లోకి తీసుకెళ్లడానికి.. ఎలా ప్రమోట్ చేయాలి..? ఎవరితో వాయిస్ ఓవర్ చెప్పించాలి..? ఎవరితో సోషల్ మీడియాలో పోస్టులు పెట్టించాలి..? ఇలా అంతా నాగ్ మాస్టర్ ప్లాన్ ప్రకారమే జరిగిందనేది ఇండస్ట్రీ ఇన్ సైడ్ న్యూస్. ఈ మూవీ ట్రైలర్ లో నాగార్జున వాయిస్ ఓవర్ అందించారు. అయితే.. సినిమాలో నాగార్జున వాయిస్ ఓవర్తో ఉంటుంది అనుకుంటే.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ని రంగంలోకి దింపి వాయిస్ ఓవర్ చెప్పించారు. ఈ విషయాన్ని అఖిల్ సోషల్ మీడియా ద్వారా తెలియచేసి.. ఎన్టీఆర్ తో కలిసి ఉన్న ఫోటోలను అఖిల్ పోస్ట్ చేశారు. ఈ ఫోటోలు వైరల్ అయ్యాయి. ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌.. సోషల్ మీడియాలో లెనిన్ ట్రైలర్ ను పోస్ట్ చేసి టీమ్ కి ఆల్ ది బెస్ట్ చెప్పారు.

ఈ మూవీ టీజర్ అండ్ ట్రైలర్ ఇంట్రెస్టింగ్ గా ఉండడం.. అఖిల్ బ్లాక్ బస్టర్ సాధించాలని సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరుకు అందరూ కోరుకుంటుండడంతో ఈసారి గురి తప్పేదేలే అనే టాక్ వినిపిస్తుంది. కథ పై చాన్నాళ్లు వర్క్ చేసారు. క్వాలిటీ కోసం ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు. సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ అదిరిపోయే రీ రికార్డింగ్ అందించారు. సో.. నాగ్ మాస్టర్ ప్లాన్ వర్కవుట్ అవుతుందని.. అఖిల్ లెనిన్ తో బ్లాక్ బస్టర్ సాధిస్తాడని.. అభిమానుల్లోనూ కాదు.. ఇండస్ట్రీలో బలంగా వినిపిస్తోంది. మరి.. నాగ్ మాస్టర్ ప్లాన్ వర్కవుట్ అయి.. అంచనాలకు తగ్గట్టుగా లెనిన్ బ్లాక్ బస్టర్ సాధిస్తుందేమో చూడాలి.

Latest Articles

నాని లైనప్ మారిందా..?

నేచురల్ స్టార్ నాని.. ప్యారడైజ్ మూవీ కోసం చాలా అంటే చాలా టైమ్ కేటాయించారు. అయినా.. ఇంత వరుకు షూటింగ్ కంప్లీట్ కాలేదు. దీంతో నెక్ట్స్ మూవీని స్టార్ట్ చేయాలని ప్లాన్ చేసినా...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్