నాని లైనప్ మారిందా..?

నేచురల్ స్టార్ నాని.. ప్యారడైజ్ మూవీ కోసం చాలా అంటే చాలా టైమ్ కేటాయించారు. అయినా.. ఇంత వరుకు షూటింగ్ కంప్లీట్ కాలేదు. దీంతో నెక్ట్స్ మూవీని స్టార్ట్ చేయాలని ప్లాన్ చేసినా ఇంత వరుకు పట్టాలెక్కలేదు. ఇప్పుడు మరో డైరెక్టర్ కి నాని గ్రీన్ సిగ్నల్ ఇచ్చారంటూ ఓ వార్త ఇండస్ట్రీలో గట్టిగా వినిపిస్తోంది. అంతే కాదండోయ్.. నాని లైనప్ మారిందని కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇంతకీ.. ప్యారడైజ్ తర్వాత నాని చేయాలి అనుకున్న మూవీ ఏంటి..? ఇప్పుడు కొత్తగా ఏ డైరెక్టర్ కి ఓకే చెప్పారు..? అసలు నాని లైనప్ మారడానికి కారణం ఏంటి..?

హిట్ 3 స‌క్సెస్ తో మరోసారి తన మార్కెట్‌ను మరింత పెంచుకున్న నాని.. ప్రస్తుతం ప్యారడైజ్ మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ మార్చిలో రిలీజ్ కావాలి కానీ.. ఇంత వరుకు రిలీజ్ కాలేదు. ఈ సినిమా రిలీజైన తర్వాత ఓజీ డైరెక్టర్ సుజిత్ తో సినిమా చేయాలి అనుకున్నాడు నాని. బ్లడీ రోమియో అనే టైటిల్ తో అనౌన్స్ మెంట్ వీడియో కూడా రిలీజ్ చేశారు. మార్చిలో ప్యారడైజ్ విడుదల అయితే.. ఏప్రిల్ లేదా మేలో సుజిత్ తో సినిమాని పట్టాలెక్కించాలి అనుకున్నారు. అయితే.. ప్యారడైజ్ పోస్ట్ పోన్ అవ్వడం వలన ఇంత వరుకు నాని కొత్త సినిమా స్టార్ట్ కాలేదు.

మరో వైపు బ్లడీ రొమియో డైరెక్టర్ సుజిత్.. ఓజీ 2 వర్క్ స్టార్ట్ చేయడంతో.. ముందుగా సుజిత్ ఎవరితో సినిమా చేస్తాడు నానితోనా..? పవర్ స్టార్ తోనా..? అనేది ఆసక్తిగా మారింది. ఓజీ 2 లేట్ అవుతుంది అనుకుంటే.. ఊహించని విధంగా స్పీడు అందుకుంది. దీంతో ఓజీ 2 తర్వాతే.. నానితో బ్లడీ రొమియో సినిమా ఉంటుందని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. సుజిత్ ప్లాన్ మారడం.. నాని ప్యారడైజ్ లేట్ అవుతుండడంతో లైనప్ మారింది. ఇప్పుడు నాని మరో డైరెక్టర్ తో సినిమా చేసేందుకు ఓకే చెప్పడం ఆసక్తిగా మారింది.

ఇంతకీ నాని ఓకే చెప్పిన డైరెక్టర్ ఎవరంటే.. వెంకీ అట్లూరి అని సమాచారం. ఇటీవల నానికి వెంకీ అట్లూరి కథ చెప్పడం.. ఈ కథకు నాని గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ప్రాజెక్ట్ ఫైనల్ అయ్యిందని సమాచారం. ఈ సినిమాని సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్ట్ ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉండగా, షూటింగ్ 2026 చివర్లో ప్రారంభం కానున్నట్లు వార్తలు వస్తున్నాయి. మొత్తానికి, నాని లైనప్ ఎంత బలంగా ఉన్నప్పటికీ, అందులో నెక్ట్స్ స్టెప్ ఎటు పడుతుందనేది మాత్రం సుజిత్ తీసుకునే నిర్ణయంపైనే ఆధారపడినట్లు కనిపిస్తోంది.

Latest Articles

బీఆర్ఎస్‌లో బావాబామ్మర్థుల ఆధిపత్య పోరు నడుస్తోందా?

తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య గత కొన్ని రోజులుగా అప్పులు, ఆర్థిక పరిస్థితి, గురుకుల టెండర్ల అంశాలపై పెద్ద ఎత్తున మాటల యుద్ధం నడుస్తోంది. ఈ పరిణామాల్లో...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్