72వ నేషనల్ అవార్డుల అనౌన్స్ మెంట్ గురించి సినీ అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. శుక్రవారం ప్రకటిస్తారని ప్రచారం జరిగింది కానీ.. ప్రకటించ లేదు. మరి.. ఎప్పుడు అనౌన్స్ చేస్తారంటే.. నెక్ట్స్ వీక్ జాతీయ అవార్డులను ప్రకటిస్తారని సమాచారం. ఇదిలా ఉంటే.. ఈసారి జాతీయ ఉత్తమ నటుడు అవార్డు గెలుచుకునే హీరో ఎవరు అనేది అటు అభిమానుల్లోనూ, ఇటు ఇండస్ట్రీలోనూ హాట్ టాపిక్ అయ్యింది. ముఖ్యంగా ముగ్గురు హీరోల పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. ఇంతకీ.. ఆ ముగ్గురు ఎవరు..?
72వ నేషనల్ ఫిల్మ్ అవార్డుల అనౌన్స్ మెంట్ కోసం సినీ అభిమానులు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ముఖ్యంగా జాతీయ ఉత్తమ నటుడు అవార్డు ఈసారి ఎవరు దక్కించుకుంటారు అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ముగ్గురు స్టార్ హీరోల పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. ఆ ముగ్గురు ఎవరంటే.. ముందుగా చెప్పుకోవాల్సింది ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. పుష్ప సినిమాతో జాతీయ ఉత్తమ నటుడుగా అవార్డు అందుకుని.. సెన్సేషన్ క్రియేట్ చేశాడు. అంతే కాకుండా.. జాతీయ ఉత్తమ నటుడు అవార్డు అందుకున్న మొట్టమొదటి తెలుగు హీరోగా అల్లు అర్జున్ చరిత్ర సృష్టించాడు. అయితే.. ఇప్పుడు పుష్ప 2 సినిమాకు గాను అల్లు అర్జున్ మరోసారి ఈ అవార్డ్ దక్కించుకుంటాడా..? లేక వేరే హీరో దక్కించుకుంటాడా అనేది సస్పెన్స్ గా మారింది. పుష్ప 2లో అల్లు అర్జున్ జాతర సాంగ్లో అద్భుతంగా నటించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. ఈ మూవీ రిలీజ్ అయినప్పటి నుంచి ఈసారి కూడా జాతీయ ఉత్తమ నటుడుగా అవార్డ్ బన్నిదే అంటూ ప్రచారం జరుగుతుంది.
ఈ అవార్డ్ కోసం పోటీపడుతున్న మరో హీరో మాలీవుడ్ స్టార్ హీరో మమ్ముట్టి. ఈ స్టార్ హీరో భ్రమయుగం సినిమాలో అద్భుతంగా నటించారు. ఆ చిత్రంలో ఆయన నటనకు ప్రేక్షకులతో పాటు విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు లభించాయి. అలాగే తమిళ స్టార్ విక్రమ్ తంగలాన్ చిత్రంలో తన యాక్టింగ్ తో ప్రత్యేక గుర్తింపు పొందారు. పాత్ర కోసం ఆయన హార్డ్ వర్క్ కూడా ప్రశంసలు అందుకుంది. ఆయన నటించిన పాత్రకు గాను ఖచ్చితంగా అవార్డ్ వస్తుందని సినీ అభిమానులు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. ఇలా జాతీయ ఉత్తమ నటుడు అవార్డు కోసం అల్లు అర్జున్, మమ్ముట్టి, విక్రమ్ పోటీపడుతున్నారు. ఈ ముగ్గురులో ఎవరో ఒకరికి అవార్డ్ రావడం ఖాయం అంటున్నారు సినీ అభిమానులు.


