ప్రశ్న రావణ్‌ ఇక జైలులోనేనా?.. ఆయనపై ఆరోపణలు ఏంటి?.. చట్టం ఏం చెబుతోంది?

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో జోసెఫ్ అలియాస్ ప్రశ్న రావణ్‌ పేరు మారుమోగుతోంది. ఏపీ ఉప ముఖ్యమంత్రి ప‌వ‌న్ క‌ళ్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశార‌న్న కార‌ణంతో రావ‌ణ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో ఎవ‌రీ రావ‌ణ్ అనే ప్రశ్న మొదలైంది. బచ్చలకూరి జోసెఫ్ అలియాస్ ప్రశ్న రావణ్ యూట్యూబ్ లో రాజకీయ, సామాజిక అంశాలపై వీడియోలు చేసే వ్యక్తిగా గుర్తింపు పొందారు. నిజానికి ఇత‌ను మొద‌ట్లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా జీవితం సాగించేవాడు. అయితే ఆ త‌ర్వాత వృత్తికి ఫుల్‌స్టాప్ పెట్టి ప్రశ్న అనే యూట్యూబ్ ఛాన‌ల్ ద్వారా వీడియోలు చేయ‌డం మొద‌లు పెట్టారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు, అధికార పక్షం, ప్రతిపక్షాలపై విమర్శలు చేస్తూ తన అభిప్రాయాలను వ్యక్తం చేస్తుంటారు. ఇటీవల ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, కూటమి ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారితీశాయి. జూన్ 28న ఏలూరులో జరిగిన ఓ సభలో ప్రశ్న రావణ్ చేసిన ప్రసంగంపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌తో పాటు ఇతర నాయకులపై వ్యక్తిగతంగా దూషించేలా మాట్లాడారని ఆరోపిస్తూ వివిధ ప్రాంతాల్లో ఫిర్యాదులు నమోదయ్యాయి. ఈ ఫిర్యాదుల ఆధారంగా పోలీసులు వరుసగా కేసులు నమోదు చేశారు.

జూలై 1న హైదరాబాద్‌లో ప్రశ్న రావణ్‌ను ఆంధ్రప్రదేశ్ పోలీసులు మొదటిసారి అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వివిధ జిల్లాల్లో నమోదైన కేసుల కారణంగా ఆయనను వరుసగా కోర్టులకు తరలించారు. ఒక కేసులో బెయిల్ లభించిన వెంటనే మరో జిల్లాలో నమోదైన కేసులో మళ్లీ అరెస్టు చేశారు. కాకినాడ, ఏలూరు, మచిలీపట్నం, పాయకరావుపేట, పిఠాపురం వంటి ప్రాంతాల్లో నమోదైన కేసుల నేపథ్యంలో కొద్ది రోజుల వ్యవధిలోనే ఆయన ఐదుసార్లు అరెస్టయ్యారు. నాలుగు కేసుల్లో కోర్టులు బెయిల్ మంజూరు చేసినప్పటికీ, మరో కేసులో పోలీసులు మళ్లీ అదుపులోకి తీసుకోవడంతో ఈ వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.పవన్ కళ్యాణ్ పై ప్రతిపక్షాల దాడి మొదలైంది. పవన్ చేసిన వ్యాఖ్యలకు ..రావణ్ చేసిన వ్యాఖ్యలకు పెద్ద తేడా ఏముంది అంటూ సోషల్ మీడియాలో చర్చ మొదలైంది…అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా జనసైనికులు రావణ్ పై కేసులు పెడుతూండటం పెద్ద వివాదంగా మారిందని. మచిలీపట్నంలో జనసైనికులు రావణ్ పై దాడి చేయడానికి గోడలు దూకటంతో ఈ వివాదం మరింత ముదిరింది .రావణ్ మద్దతుదారులు WE స్టాండ్ WITH రావణ్ అనే స్లోగన్ తీసుకున్నారు. జనసైనికుల దాడులనూ, రావణ్ అరెస్ట్ ను రావణ్ మద్దతుదారులు ముక్తకంఠంతో ఖండించినా జన సైనికుల కేసుల పరంపర మాత్రం కొనసాగుతూనే వస్తుంది .. ఇదిలా ఉంటే అసలు ప్రశ్న రావణ్‌పై నమోదైన ఆరోపణలు ఏంటి.?

ఫిర్యాదుదారులు, పోలీసులు చేసిన ఆరోపణల ప్రకారం, ప్రశ్న రావణ్ తన ప్రసంగాలు, యూట్యూబ్ వీడియోల్లో రాజకీయ నాయకులపై వ్యక్తిగత వ్యాఖ్యలు చేయడం, అభ్యంతరకర పదజాలం ఉపయోగించడం, సామాజిక ఉద్రిక్తతలకు దారితీసేలా మాట్లాడినట్లు కేసులు నమోదు చేశారు. కొన్ని ఫిర్యాదుల్లో మతపరమైన భావోద్వేగాలను దెబ్బతీసే వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. అలాగే సోషల్ మీడియాలో అసభ్యకర థంబ్‌నెయిల్స్, వ్యక్తిగత విమర్శలు, దూషణాత్మక వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదుల్లో పేర్కొన్నారు.

తనపై నమోదవుతున్న కేసులు భావ ప్రకటనా స్వేచ్ఛను అణిచివేసే ప్రయత్నమని ప్రశ్న రావణ్ చెబుతున్నారు. ఒక కేసులో బెయిల్ వచ్చిన వెంటనే మరో కేసులో అరెస్టు చేయడం ద్వారా తనను నిరంతరం జైలులోనే ఉంచాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. తనపై ఐదోసారి అరెస్టు జరిగిందని, రాష్ట్రంలో ప్రజా సమస్యలను పక్కనబెట్టి పోలీసులు తనపైనే దృష్టి పెట్టారని విమర్శించారు. తాను ఎలాంటి నేరాలు చేయలేదని, కేవ‌లం రాజకీయ నాయకులను ప్రశ్నించానని చెప్పారు. అలాగే చట్టబద్ధంగా నిరసన తెలిపే హక్కు తనకు ఉందని, ప్రభుత్వం తన గొంతును నొక్కే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. అవసరమైతే ఆమరణ నిరాహార దీక్ష చేపడతానని కూడా ప్రకటించారు. రావణ్ వాదన ఇలా ఉంటె చట్టం మాత్రం .. భావప్రకటన స్వేచ్ఛ – సోషల్ మీడియా చట్టాలు భారత రాజ్యాంగం పౌరులందరికీ మాట్లాడే హక్కును ఇచ్చినప్పటికీ, సోషల్ మీడియాలో ఏది పడితే అది మాట్లాడటానికి వీల్లేకుండా స్పష్టమైన పరిమితులను విధించిందని చెబుతోంది

రాజ్యాంగ పరిధులు మనకు భావప్రకటన స్వేచ్ఛను ఇస్తుంది. కానీ, ఆర్టికల్ 19(2) ప్రకారం దేశ భద్రత, ప్రజా శాంతి, కోర్టు ధిక్కరణ, ఇతరుల వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించేలా మాట్లాడితే ఆ స్వేచ్ఛ వర్తించదు. ఐటీ చట్టం నూతన డిజిటల్ నిబంధనల ప్రకారం సోషల్ మీడియా లేదా యూట్యూబ్‌లో ఒక వర్గాన్ని కించపరిచేలా, మహిళలను అసభ్యంగా చూపేలా, లేదా దేశ సార్వభౌమాధికారానికి ముప్పు తెచ్చేలా కంటెంట్ పెడితే ఐటీ చట్టాల ప్రకారం కఠిన చర్యలు ఉంటాయి అనే అంశం స్పష్టం చేస్తుంది. మరి రావణ్ వాదనను ఎలా సమర్ధించాలి అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న

తనపై రాష్ట్రవ్యాప్తంగా నమోదైన అన్ని కేసులను ఒకేచోట విచారించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ ప్రశ్న రావణ్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించారు. వివిధ జిల్లాల్లో విడివిడిగా నమోదైన కేసులన్నింటినీ ఒకే కేసుగా పరిగణించాలని ఆయన పిటిషన్‌లో కోరారు. అలాగే ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తోందని ఆరోపిస్తూ, కేసుల విచారణను సీబీఐ లేదా స్వతంత్ర న్యాయపరమైన సంస్థకు అప్పగించాలని కూడా విజ్ఞప్తి చేశారు. తనపై నమోదైన కొన్ని తీవ్రమైన సెక్షన్లను రద్దు చేయాలని, కోర్టు ముందు హాజరుపరచాలని కూడా పిటిషన్‌లో కోరారు. ఇదిలా ఉండగా, ఈ వ్యవహారంపై రాజకీయంగా కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవైపు ప్రభుత్వం, ఫిర్యాదుదారులు చట్ట ప్రకారమే చర్యలు తీసుకుంటున్నామని చెబుతుండగా, మరోవైపు ప్రశ్న రావణ్ అనుచరులు, కొందరు రాజకీయ నాయకులు వరుస అరెస్టులు దుర్వినియోగమని విమర్శిస్తున్నారు. ఈ కేసుల్లో తుది నిర్ణయం న్యాయస్థానాల విచారణ అనంతరం వెలువడనుందా ..అంటే అవుననే వాదనే నిజం. ఎందుకంటే రావణ్ పై నమోదైన కేసులు ఎక్కువ గా ఉండటమే కారణం ..అయితే ఇంకో వాదన కూడా కోర్టు ముందుకు వచ్చే అవకాశం లేకపోలేదు. యూట్యూబ్ ఉంది క‌దా అని ఏది ప‌డితే అది మాట్లాడితే కుద‌ర‌ద‌ని. త‌మ‌కు వ్యక్తిగత స్వేచ్ఛ ఉంటుంద‌నేది ఎంత నిజ‌మో.. ఆ స్వేచ్ఛ ఇత‌రుల‌కు ఇబ్బందిక‌రంగా మార‌కూడ‌దన్న దాంట్లోనూ అంతే నిజం ఉంటుంద‌ని గుర్తించాల‌నే భావన కూడా కోర్టు ముందు వ్యక్తం అవుతుందా? ప్రశ్నిస్తున్నామన్న పేరుతో అస‌భ్య ప‌ద‌జాలాన్ని ఉప‌యోగిస్తే క‌చ్చితంగా చ‌ట్ట ప్రకారం శిక్షను ఎదుర్కోవాల్సిందేన‌ని కోర్టు స్పష్టం చేస్తుందా?..ఆలా స్పష్టం చేస్తే రావణ్ ఇప్పటిలో బయటకు వచ్చే అవకాశం చాల తక్కువ ఉంటుంది అనేది న్యాయ నిపుణుల అభిప్రాయం

ఇక రావణ్ కేవలం సెన్సేషన్ కోసమే వీడియోలు చేస్తున్నాడంటూ ఆరోపణలు వస్తున్నాయి. యూట్యూబ్ ఛానల్ పేరు ప్రశ్న అని ఉందని కానీ అందులో ప్రజా సమస్యలపై ప్రశ్నలు లేవని అంటున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విధానాలు, అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజా ప్రయోజన అంశాలు లేదా ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలోని పంచాయతీరాజ్, అటవీ శాఖల పనితీరుపై సమాచార హక్కు చట్టం ద్వారా సమాధానాలు కోరిన సందర్భాలు కనిపించడం లేదని చెబుతున్నారు. అలాగే ప్రజలకు ఉపయోగపడే విధానపరమైన చర్చలు, పాలనపై విశ్లేషణలు కూడా ఛానల్‌లో చాలా అరుదుగా కనిపిస్తున్నాయని ఆరోపిస్తున్నారు. ప్రశ్న ఛానల్‌లో ఎక్కువగా రాజకీయ నాయకులపై వ్యక్తిగత విమర్శలు, పవన్ కళ్యాణ్‌ను లక్ష్యంగా చేసుకున్న వీడియోలు, మతపరమైన వివాదాలకు దారితీసే వ్యాఖ్యలే ప్రధానంగా కనిపిస్తున్నాయని అంటున్నారు.

ఫిర్యాదుదారులు, పోలీసులు చేసిన ఆరోపణల ప్రకారం, ప్రశ్న రావణ్ తన ప్రసంగాలు, యూట్యూబ్ వీడియోల్లో రాజకీయ నాయకులపై వ్యక్తిగత వ్యాఖ్యలు చేయడం, అభ్యంతరకర పదజాలం ఉపయోగించడం, సామాజిక ఉద్రిక్తతలకు దారితీసేలా మాట్లాడినట్లు కేసులు నమోదు చేశారు. కొన్ని ఫిర్యాదుల్లో మతపరమైన భావోద్వేగాలను దెబ్బతీసే వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. అలాగే సోషల్ మీడియా లో అసభ్యకర థంబ్‌నెయిల్స్, వ్యక్తిగత విమర్శలు, దూషణాత్మక వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదుల్లో పేర్కొన్నారు. ఏది ఏమైనా ప్రశ్న రావణ్ వివాదంలోకి జనసేనా పార్టీనీ, జనసైనికులే లాగటం వాళ్ళ అత్యుత్సహానికి నిదర్శనం.ఈ ఎపిసోడ్‌లో కొసమెరుపు ఏంటంటే జనసేనాని పవన్ కళ్యాణ్ మౌనం విడకపోవడం.

Latest Articles

మల్లారెడ్డి పార్టీ మారుతారన్న ప్రచారం.. కాంగ్రెస్‌ లేదా బీజేపీలోకి?

మాజీ మంత్రి, ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి పార్టీ మారడం దాదాపు ఖరారు అయిందా...? అందుకే గులాబీ పార్టీకి దూరంగా ఉంటున్నారా...? బిఆర్ఎస్ అధిష్టానం సైతం మల్లారెడ్డిని లైట్ తీసుకుందా...? తాజాగా మాజీ మంత్రి...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్