ఇందిరమ్మ ఇళ్లలో పైరవీకారులు చేతివాటం చూపిస్తున్నారు. వికారాబాద్ జిల్లాలో ఇందిరమ్మ ఇల్లు అర్హుల లిస్టులో పేరు కల్పిస్తామని 50 వేల రూపాయలు వసూలు చేస్తున్నారు. ఆ బిల్లులను మంజూరు చేయడానికి 10 వేల రూపాయలను వసూలు చేస్తున్నారు. ప్రభుత్వం ఏ సంక్షేమ పథకం ప్రారంభించిన పైరవీకారులు తమ స్వలాభం కోసం మార్చుకుంటున్నారు. పేదల ప్రయోజనమే లక్ష్యంగా ఏ పథకాన్ని అనౌన్స్ చేసినా దళారులు ముందు వరుసలో ఉంటూ తమ చేతివాటం చూపిస్తున్నారు. అర్హత లేకున్నా పథకంలో లబ్ధి కల్పిస్తామని బేరసారాలు మాట్లాడుకుంటున్నారు. తాండూరు నియోజకవర్గం బషీరాబాద్ మండలం జలాల్‌పూర్‌లో లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యాయి. దీంతో ఆ గ్రామ ఉప సర్పంచ్, మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు తామే ఇల్లు వచ్చేలా చేశానని నమ్మబలుకుతున్నారు. బిల్లు సాంక్షన్ అవ్వాలంటే తనకు 10 వేల రూపాయలు కావాలని డిమాండ్ చేస్తున్నారని పలువురు లబ్ధిదారులు ఆరోపిస్తున్నారు. దీనికి సంబంధించిన ఆడియోతో పాటు ఓ వీడియోను లబ్ధిదారులు రహస్యంగా చిత్రీకరించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇందిరమ్మ ఇళ్లలో పైరవీకారుల చేతివాటం
0
58
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


