సంగారెడ్డి జిల్లాలో అక్రమ కట్టడాలపై సైబరాబాద్ మున్సిపల్ అధికారులు ఉక్కుపాదం మోపారు. జిల్లాలోని అమీన్‌పూర్ సర్కిల్, బీరంగూడ డివిజన్ పరిధిలో మున్సిపల్ సిబ్బంది ముమ్మరంగా కూల్చివేతలు చేపట్టారు. సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోకి వచ్చే బీరంగూడ ప్రధాన రహదారిపై అధికారులు ఈ ఉదయం నుంచి ప్రత్యేక చర్యలు ప్రారంభించారు. ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగిస్తూ, నిబంధనలకు విరుద్ధంగా బీరంగూడ మెయిన్ రోడ్డుపై అక్రమంగా వెలిసిన షెడ్లను, పెద్ద పెద్ద సైన్ బోర్డులను మున్సిపల్ సిబ్బంది జేసీబీల సహాయంతో పూర్తిగా తొలగిస్తున్నారు. ఆక్రమణల తొలగింపు నేపథ్యంలో స్థానికంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులె గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.
సంగారెడ్డి జిల్లాలో అక్రమ కట్టడాలపై ఉక్కుపాదం
0
57
Previous article
Next article
Latest Articles
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో పెరుగుతున్న సీనియర్ల అసంతృప్తి
తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి సొంత నేతల నుంచే తీవ్ర స్థాయి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఒకవైపు ప్రతిపక్షాల విమర్శలను దీటుగా ఎదుర్కొంటున్న ప్రభుత్వానికి, అంతర్గతంగా సీనియర్ నాయకుల అసంతృప్తి వ్యవహారం పెద్ద...
- Advertisement -
- Advertisement -


