ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌లపై సోషల్ మీడియాలో అనుచిత, అవమానకర వ్యాఖ్యలు చేశారనే ఆరోపణల నేపథ్యంలో ప్రశ్న రావణ్ పై రాష్ట్రవ్యాప్తంగా ఫిర్యాదులు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో ప్రకాశం జిల్లా ఒంగోలులోనూ ఆయనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఒంగోలు వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఉడా చైర్మన్ షేక్ రియాజ్ ఫిర్యాదు అందజేశారు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్‌లపై సోషల్ మీడియా వేదికగా ప్రశ్న రావణ్ చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయని, అవి ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇప్పటికే పిఠాపురం పోలీస్ స్టేషన్‌లో ప్రశ్న రావణ్‌పై కేసు నమోదైందని, అదే తరహాలో ఒంగోలులో కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని షేక్ రియాజ్ పోలీసులను కోరారు. ప్రజల్లో విద్వేషాలు రెచ్చగొట్టేలా, ప్రజాప్రతినిధుల పరువుకు భంగం కలిగించేలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
ప్రశ్న రావణ్ పై రాష్ట్రవ్యాప్తంగా ఫిర్యాదులు
0
80
Previous article
Next article
Latest Articles
భారత వీరుడికి ‘సలామ్’
ఆ రోజు అసలేం జరిగిందంటే..!
ఫ్లైదుబాయ్ (Flydubai) విమానంలో జరిగిన ఒక ఘోరమైన విమాన ప్రమాద ఉదంతంలో భారతీయ పైలట్ అయిన కెప్టెన్ స్మిత్ మచ్చార్ (Captain Smit Machchhar) అసాధారణ ధైర్యసాహసాలు ప్రదర్శించి,...
- Advertisement -
- Advertisement -


