7 గ్రామాల రైతులకు రూ. లక్షన్నర వరకు రుణమాఫీకి ఏపీ మంత్రి వర్గం ఆమోదం

సీఎం చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ముగిసింది. దాదాపు 30కి పైగా అజెండా అంశాలకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. గ్రామాల్లో రూ.9,355 కోట్లతో 10 మల్టీ విలేజ్ డ్రింకింగ్ వాటర్ స్కీమ్స్ – డ్రింకింగ్ వాటర్ స్కీమ్స్ మంజూరుకు ఆమోదం తెలిపింది. నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాలకు 2,943 తాగునీటి పథకాలు.. రూ.1,811 కోట్లతో తాగునీటి పథకాలకు మంత్రివర్గం అనుమతించింది. విశాఖలో ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు ఏర్పాటుకు ఆమోదం తెలిపింది.

తిరుపతి జిల్లాలో 63 ఎకరాల్లో లాజిస్టిక్స్ పార్క్ ఏర్పాటుపై చర్చ జరిగింది. పర్యాటక పాలసీలో భాగంగా రాష్ట్రంలో కాన్సర్ట్ ల నిర్వహణ..కాన్సర్ట్ లకు ప్రత్యేక విధానం ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది మంత్రి వర్గం. రూ.50 కోట్లతో పర్యాటక ప్రచారానికి కేబినెట్‌ ఆమోదించింది. అలాగే నెల్లూరులో ఐటీసీ హోటల్, కడపలో మాధవి హోటల్‌కు ప్రోత్సాహకాలకు ఆమోదించింది. విజయవాడలో సరోవర్ పోర్టికో హోటల్‌కు ప్రోత్సాహకాలకు , కడపలో ఇంటిగ్రేటెడ్ అమ్యూజ్మెంట్ పార్కు ప్రోత్సాహకాలకు ఆమోదం తెలిపింది. విశాఖ, గుంటూరు, నెల్లూరులో అంబేడ్కర్ గురుకుల సీవోఈ ఏర్పాటుకు ఆమోదించింది.

ఐఐటీ జేఈఈ, నీట్‍కు రెసిడెన్షియల్ కోచింగ్ ప్రతిపాదనలను ఆమోదించింది. పెద్దగెడ్డ రిజర్వాయర్ కమాండ్ ఏరియా ఆధునికీకరణకు ఆమోదం తెలిపింది. కుప్పంలో ఫీడర్ ఛానెల్స్, బీరగానిపల్లె రిజర్వాయర్‌కు కేబినెట్ అనుమతులు ఇచ్చింది. ఎస్ఐపీబీ సిఫార్సులతో భారీ పెట్టుబడులకు ప్రోత్సాహకాలకు కేబినెట్‌ ఆమోదించింది. సీఆర్డీఏ అథారిటీ ఆమోదించిన సంస్థలకు భూకేటాయింపులకు ఆమోదం తెలిపింది.

అమరావతిలో రెండో విడతకు భూములిచ్చే రైతులకు సాగు రుణమాఫీకి, భూమి సమీకరించే 7 గ్రామాల రైతులకు రూ. లక్షన్నర వరకు రుణమాఫీకి ఏపీ మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. 2026 జనవరి 6 కంటే ముందు తీసుకున్న రుణాలకు మాఫీ వర్తింపుకు ఆమోదించింది. భూములిచ్చిన, ఇవ్వబోయే రైతులకు వార్షిక కౌలు పెంపు ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. మెట్ట రైతులకు రూ.40 వేలకు, జరీబు రైతులకు రూ.60 వేలకు కౌలు పెంపునకు ఆమోదం తెలిపింది కేబినెట్‌. మెట్ట రైతులకు ఏటా రూ.3 వేలు, జరీబు రైతులకు రూ.5 వేల చొప్పున కౌలు పెంపు, రెండో విడత భూసమీకరణ గ్రామాల్లోని ఇనాం భూములకు పరిహారానికి, 307 ఎకరాల ఇనాం భూములకు దేవదాయశాఖకు రూ.159 కోట్ల పరిహారం , ఎన్‍ఎఫ్‍డీబీకి భారీ అక్వేరియం, కార్యాలయం కోసం భూకేటాయింపులకు ఆమోద ముద్ర పడింది. ఈశా ఫౌండేషన్, ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థలకు భూకేటాయింపులకు ఆమోదించింది కేబినెట్‌. సేఐఐ గ్లోబల్ లీడర్‍షిప్ సెంటర్ సంస్థలకు భూకేటాయింపులకు ఆమోదం తెలిపింది ఏపీ కేబినెట్‌.

Latest Articles

దటీజ్.. మెగాస్టార్..

మెగాస్టార్ చిరంజీవి నాటి నుంచి నేటి వరుకు ఆడియన్స్ ని ఎంటర్ టైన్ చేస్తూనే ఉన్నారు. ఇంకా చెప్పాలంటే.. యంగ్ హీరోలకు కూడా గట్టి పోటీ ఇచ్చేలా ఏమాత్రం గ్యాప్ లేకుండా సినిమాలు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్