మార్చి 9 తర్వాత లోక్ సభ ఎన్నికలపై ఎన్నికల కమిషన్ ప్రకటన

        లోక్ సభ ఎన్నికలపై కేంద్ర ఎన్నికల కమిషన్ మార్చి 9 తర్వాత స్పష్టమైన ప్రకటన చేసే అవకాశం ఉంది. దేశంలో 18వ లోక్ సభకు సార్వత్రిక ఎన్నికలు ఏప్రిల్, మే నెలల్లో జరగనున్నాయి. 2024 లోక్ సభ ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్ సహా కొన్ని రాష్ట్రాల్లో ఏకకాలంలో అసెంబ్లీ ఎన్నికలకు ఎన్నికల కమిషన్ సన్నాహాలు చేస్తోంది. ఈసీఐ అధికారుల బృందం ఈ మధ్య వివిధ రాష్ట్రాలలో వరుస పర్యటనలు చేస్తోంది. జమ్మూ కశ్మీర్ లోనూ ఎన్నికల ప్రక్రియ ప్రారంభించే అంశాన్ని ఎన్నికల కమిషన్ పరిశీలిస్తోంది. ముందు జమ్ము కశ్మీర్ లో భద్రతా పరిస్థితిని ఎన్నికల కమిషన్ అంచనా వేస్తోంది. జమ్ముకశ్మీర్ భద్రతా పరిస్థితి, బలగాల లభ్యత పరిస్థితిపై ఈసీఐ ప్రతినిధులు మార్చి 8,9 తేదీల్లో ఆ రాష్ట్ర ప్రభుత్వాధికారుల ను కలుస్తున్నారు. లోక్ సభ ఎన్నికలతో పాటు యూటీలో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిం చవచ్చా లేదా అని క్షేత్రస్థాయి పరిస్థితులను అంచనా వేసేందుకు వారు మార్చి 12,13 తేదీల్లో జమ్మూ కశ్మీర్ లో పర్యటి స్తున్నారు. భద్రతాబలగాల లభ్యతపై అంతా ఆధారపడి ఉంటుందని అధికారవర్గాలు తెలిపాయి.

 

Latest Articles

గాంధీభవన్‌లో రాహుల్‌ గాంధీ జన్మదిన వేడుకలు..జాబ్‌ మేళా

కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ జన్మదిన వేడుకలను హైదరాబాద్‌లోని గాంధీభవన్ లో ఘనంగా నిర్వహించారు. రాహుల్ గాంధీ జన్మదినం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నేతలతో కలిసి టీపిసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
347FollowersFollow
424,168SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్