శివసేన-కాంగ్రెస్ విలీన ప్రణాళిక.. లోక్‌సభ స్పీకర్‌కు తిరుగుబాటు ఎంపీల ఫిర్యాదు

ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేనకు చెందిన ఆరుగురు తిరుగుబాటు ఎంపీలు పార్టీని వీడి, ఏక్‌నాథ్ షిండే వర్గంలో విలీనం కావడానికి ప్రయత్నిస్తున్న నేపథ్యంలో బుధవారం లోక్‌సభ స్పీకర్ ఓమ్‌ బిర్లా(‌Om Birla)ను కలవడం చర్చనీయాంశమైంది. విశ్వనీయ సమాచారం ప్రకారం.. ఈ ఆరుగురు ఎంపీలు స్పీకర్‌కు తమ వాదనను వినిపించారు. 2022 జూన్‌లో ఏక్‌నాథ్ షిండే తిరుగుబాటుకు ముందు ఉన్న అసలు శివసేనగా భావించే ఉద్ధవ్ ఠాక్రే వర్గం తన మూల సిద్ధాంతాలను వదిలేసిందని అన్నారు.

ముఖ్యంగా, ఉద్ధవ్ వర్గంలోని సీనియర్ నేతలు భవిష్యత్తులో కాంగ్రెస్‌(Indian National Congress)లో విలీనం కావాలని యోచిస్తున్నారని వారు ఆరోపించారు. మహారాష్ట్రలో ప్రతిపక్ష కూటమి అయిన మహా వికాస్‌ అఘాడీ( Maha Vikas Aghadi)లో కాంగ్రెస్ కీలక భాగస్వామి కాగా, ఉద్ధవ్ ఠాక్రేకు మిత్రపక్షంగా ఉంది.

ఈ ప్రతిపాదిత విలీనమే తాము పార్టీని వీడటానికి ప్రధాన కారణమని ఆ ఎంపీలు స్పీకర్‌కు వివరించినట్లు సమాచారం. అలాగే, లోక్‌సభలో ఏక్‌నాథ్ షిండే వర్గానికి చెందిన ఏడుగురు ఎంపీలు కూర్చున్న స్థానాలకు సమీపంలో తమకు కూడా సీట్లు కేటాయించాలని వారు స్పీకర్‌ను కోరినట్లు తెలుస్తోంది

Latest Articles

ప్రారంభమైన.. క్రేజీ మల్టీస్టారర్..

పటాస్ సినిమా నుంచి మన శంకర్ వరప్రసాద్ గారు వరుకు ప్లాప్ అనేది లేకుండా వరుసగా సక్సెస్ సాధిస్తున్న హిట్ మిషన్ అనిల్ రావిపూడి (anil ravipudi). లేటెస్ట్ గా విక్టరీ వెంకటేష్‌...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
347FollowersFollow
424,168SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్