సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి లష్కర్ బోనాల ఉత్సవాల్లో ప్రతిష్టాత్మకమైన ఘట్టం రంగం ముగిసింది. పచ్చి కుండపై నిలబడి మాతంగి స్వర్ణలత అమ్మవారి ఆవహింపుతో భవిష్యవాణి వినిపించారు. తాను సంతోషంతో రాలేదని.. క్రోధంతో ఇక్కడికి వచ్చానని చెప్పారు. భక్తులు తాను చెప్పింది అనుసరించట్లేదని.. తాను ఎందుకు పలకాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతీ ఏడాది లాగే ఈ ఏడాది కుంభవృష్టి వర్షాలు కురుస్తాయన్నారు. అయితే వరదల్లో జనాలు కొట్టుకుపోయే అవకాశముందని జాగ్రత్తగా ఉండాలని సూచించారు. అగ్నిప్రమాదాలు కూడా జరుగుతాయని అప్రమత్తత అవసరమని పేర్కొన్నారు. జనాలు వావివరసలు లేకుండా ప్రవర్తిస్తారని తెలిపారు. తన విగ్రహ ప్రతిష్ఠ చేస్తానని చెప్పి.. మాట తప్పారని ఆగ్రహించారు. భవిష్యవాణి వినేందుకు రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు లక్షలాదిగా తరలివచ్చారు.
వరదల్లో జనాలు కొట్టుకుపోయే పరిస్థితి.. భవిష్యవాణి వినిపించిన మాతంగి స్వర్ణలత
0
39
Previous article
Latest Articles
తెలంగాణలో రసవత్తరంగా ఆస్తుల ప్రదర్శన
తెలంగాణ రాష్ట్రం వచ్చి పన్నెండేళ్లు అవుతున్న సందర్భంగా మన రాజకీయ నాయకులు ఎంతగా అభివృద్ధి చెందారో ఇప్పుడు ప్రజలకు కళ్లకు కట్టినట్లు అర్థమవుతోంది. రాష్ట్రం ఏమో కానీ నాయకుల భూబ్యాంకులు మాత్రం ఎకాయెకిన...
- Advertisement -
- Advertisement -


