బండి భగీరథ్ పోక్సో కేసులో అరెస్ట్ కాకుండా మెడికవర్ ఆసుపత్రిలో ఉంచారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు. కేటీఆర్ చిట్ చాట్‌లో మాట్లాడారు. MAX Bకంపెనీ నుంచి మెడికవర్ ఆసుపత్రికి డబ్బులు వస్తున్నాయని ఆయన ఆరోపించారు. మెడికవర్ ఆస్పత్రి సీఎం రేవంత్ రెడ్డి బంధువు శరత్ రెడ్డిది. పోక్సో కేసులో ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ పోరాటం వల్లనే బండి భగీరథ్ అరెస్ట్ అయ్యాడని అన్నారు. లేకపోతే బెయిల్ వచ్చేంత వరకు మెడికవర్ ఆసుపత్రిలోనే బండి భగీరథ్ ఉండేవాడని.. రాష్ట్రంలో ఏం జరుగుతుందో అన్ని చూస్తున్నామని చెప్పారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక ఒక్కొక్కటి బయటకు తీస్తామని కేటీఆర్ హెచ్చరించారు.
బండి భగీరథ్ అరెస్ట్ కాకుండా మెడికవర్ ఆసుపత్రిలో ఉంచారు- కేటీఆర్
0
61
Latest Articles
తెలంగాణలో రసవత్తరంగా ఆస్తుల ప్రదర్శన
తెలంగాణ రాష్ట్రం వచ్చి పన్నెండేళ్లు అవుతున్న సందర్భంగా మన రాజకీయ నాయకులు ఎంతగా అభివృద్ధి చెందారో ఇప్పుడు ప్రజలకు కళ్లకు కట్టినట్లు అర్థమవుతోంది. రాష్ట్రం ఏమో కానీ నాయకుల భూబ్యాంకులు మాత్రం ఎకాయెకిన...
- Advertisement -
- Advertisement -


