దసరా బరిలో.. ఆ నలుగురు..?

సినిమా ఇండస్ట్రీకి అసలైన సీజన్ అంటే.. సంక్రాంతే. అందుకనే.. సంక్రాంతికే ఎక్కువ సినిమాలను రిలీజ్ చేసేందుకు పోటీపడుతుంటారు. సమ్మర్ సీజన్ ఉంది కానీ.. ఈసారి వేస్ట్ అయిపోయింది. ఇప్పుడు ఫోకస్ దసరా సీజన్ పై షిప్ట్ చేసారని.. ఈసారి సంక్రాంతికి మించి అనేలా బాక్సాఫీస్ దగ్గర దసరా పోటీ ఉండబోతుంది అనేది ఇండస్ట్రీ ఇన్ సైడ్ న్యూస్. అంతేకాదండోయ్ ఈసారి.. ఆ నలుగురు దసరాకి రంగంలోకి దిగుతున్నారనే వార్త జోరుగా ప్రచారం జరుగుతుంది. ఇంతకీ.. ఆ నలుగురు ఎవరు..? దసరాకి వచ్చే సినిమాలు ఏంటి..?

సంక్రాంతికి రిలీజ్ చేస్తే.. యావరేజ్ మూవీకి కూడా భారీగా కలెక్షన్స్ రావడం.. సక్సెస్ అవుతుండడంతో స్టార్ హీరోలు, నిర్మాతలు, దర్శకులు అందరి టార్గెట్ సంక్రాంతే అయ్యింది. అందుకనే సంక్రాంతికి రిలీజ్ చేయడం కోసం సంవత్సరం ముందు నుంచి పోటీపడుతుంటారు. అయితే.. సంక్రాంతి వలే భారీగా కలెక్షన్స్ రాబట్టే మరో సీజన్ దసరా. ఈ ఇయర్ లో సమ్మర్ సీజన్ వేస్ట్ అయిపోవడంతో ఇప్పుడు దసరా పై ఫోకస్ పెట్టారు. మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర సినిమా ఎప్పుడో రిలీజ్ కావాలి కానీ.. ఇంత వరుకు విడుదల కాలేదు. సమ్మర్ లో రిలీజ్ చేయాలి అనుకున్నారు కుదరలేదు. ఆతర్వాత జూన్, జులై, ఆగష్టు అంటూ ప్రచారం జరిగింది కానీ.. ఫైనల్ కాలేదు. లేటెస్ట్ గా దసరాకి ఈ మూవీని రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారని సమాచారం. వశిష్ట్ డైరెక్షన్లో యు.వీ క్రియేషన్స్ నిర్మించిన విశ్వంభర మూవీ ఓటీటీ హ‌క్కుల వ్య‌వ‌హారం కూడా ఓ కొలిక్కి వ‌చ్చిన‌ట్టు స‌మాచారం. చిరుతో నిర్మాత‌లు త్వ‌ర‌లో స‌మావేశం కానున్నారు. ఆతర్వాత రిలీజ్ డేట్ పై క్లారిటీ వస్తుందని.. రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తారని టాక్ వినిపిస్తోంది.

ఇక బాలయ్య.. మలినేని గోపీచంద్ తో భారీ చిత్రం చేస్తున్నారు. ఈ మూవీ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. బ్లాక్ బస్టర్ మూవీ వీరసింహారెడ్డి కాంబోలో రూపొందుతోన్న మూవీ కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ సినిమాను దసరాకి రిలీజ్ చేయాలి అనేది ప్లాన్. త్వరలో షూటింగ్ కంప్లీట్ చేసి.. రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇచ్చేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇక టాలీవుడ్ కింగ్ నాగార్జున 100వ సినిమా షూటింగ్ సైలెంట్ గా జరుగుతుంది. కోలీవుడ్ డైరెక్టర్ కార్తీక్ ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై నాగార్జున ఈ సినిమాని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. అయితే.. ఈ మూవీని దసరాకి విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నట్టుగా ప్రచారం జరుగుతుంది. ఈమధ్య నాగ్ ప్లాన్ మారిందని.. సంక్రాంతికి రిలీజ్ చేస్తారని ప్రచారం జరిగింది కానీ.. దసరాకి విడుదల చేస్తారనేది ఇన సైడ్ న్యూస్.

Latest Articles

వరద నిర్వహణ, నీటి నిల్వ సమస్యలపై మల్కం చెరువు వద్ద సమన్వయ సమావేశం

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు వర్షాకాలంలో నీటి నిల్వలు, పట్టణ వరదలు, ట్రాఫిక్ అంతరాయాల నివారణకు చేపడుతున్న చర్యలపై మంగళవారం మల్కం చెరువు వద్ద ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి అధ్యక్షతన...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
347FollowersFollow
424,168SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్