కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలను హైదరాబాద్‌లోని గాంధీభవన్ లో ఘనంగా నిర్వహించారు. రాహుల్ గాంధీ జన్మదినం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నేతలతో కలిసి టీపిసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కేక్ కట్ చేశారు. అనంతరం కేక్‌ను తినిపించుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన జాబ్ మేళా నిర్వహించారు.
ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ… దేశ యువతకు ఉపాధి, అవకాశాల కల్పనే రాహుల్ గాంధీ ప్రధాన లక్ష్యమని అన్నారు. దేశంలోని నిరుద్యోగ యువత ఎదుర్కొంటున్న సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తున్న నాయకుడని అన్నారు. ఉద్యోగ నియామక పరీక్షలలో తరచూ జరుగుతున్న పేపర్ లీకేజీల కారణంగా లక్షలాది మంది యువత తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.


