హైదరాబాద్ అమీర్‌పేట్ మైత్రివనం సర్కిల్ పరిసర ప్రాంతాల్లో ఫైర్ డిపార్ట్‌మెంట్ ప్రత్యేక తనిఖీలు నిర్వహించింది. పలు వాణిజ్య, కార్యాలయ, బహుళ అంతస్తుల భవనాలను పరిశీలించింది. భవనాల్లో ఫైర్ సేఫ్టీ నిబంధనలు అమలవుతున్నాయా లేదా అనే అంశంపై తనిఖీ నిర్వహించింది. ఫైర్ ఎక్స్‌టింగ్విషర్లు, ఫైర్ అలారమ్‌లు, స్ప్రింక్లర్ వ్యవస్థలను పరిశీలించింది. అత్యవసర పరిస్థితుల్లో వినియోగించే ఎమర్జెన్సీ ఎగ్జిట్‌లను పరిశీలించింది. అగ్నిమాపక పరికరాల నిర్వహణ, పనితీరుపై తనిఖీలు చేశారు అధికారులు. ఫైర్ NOC నిబంధనల అమలుపై అధికారులు దృష్టి పెట్టారు. నిబంధనలు ఉల్లంఘించిన భవన యాజమాన్యాలకు నోటీసులు ఇవ్వనున్నారు. అగ్నిప్రమాదాల నివారణ, ప్రజల ప్రాణాలు, ఆస్తుల రక్షణే లక్ష్యంగా ఈ తనిఖీలు జరిగాయి.
అమీర్‌పేట్ మైత్రివనం సర్కిల్ పరిసర ప్రాంతాల్లో ఫైర్ సేఫ్టీ తనిఖీలు
0
132
Previous article
Next article
Latest Articles
అమెరికాలో హిందూ ఆలయంపై దాడి
ఆలయంలో భక్తులు పూజలో మునిగిపోయారు. దైవ చింతనలో లీనమయ్యారు.. సరిగ్గా అదే సమయాన్ని అదునుగా తీసుకున్నారు కొందరు దుండగులు. ఆలయాన్ని చుట్టుముట్టి.. ఇటుకలతో టార్గెట్ చేసి దాడికి...
- Advertisement -
- Advertisement -


