హైదరాబాద్‌లోని దిల్‌సుఖ్ నగర్ రోడ్లపై తెలంగాణ టైగర్ పేరుతో ఓవర్ స్పీడ్‌తో ఓ కారు హల్‌చల్ చేసింది. కారు నెంబర్ ప్లేట్ స్థానంలో సీఎం రేవంత్ రెడ్డి పేరు ఉంది. కారు వెనుక అద్దంపై సీఎం రేవంత్ రెడ్డి ఫోటో రేడియం స్టిక్కర్ కనిపిస్తున్నాయి. అదే అద్దంపై ఎడమవైపు పైన అడ్వకేట్ సింబల్ స్టిక్కర్ కూడా ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరును పోకిరీలు దుర్వినియోగం చేస్తున్నట్లు తెలుస్తోంది. యధేచ్ఛగా ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించి రద్దీ రోడ్డులో స్పీడ్ గా కారు తోలుతూ మిగతా వాహనదారులను భయబ్రాంతులకు గురిచేస్తున్నారు. దిల్‌సుఖ్‌నగర్ మెయిన్ రోడ్డుపై రెండు కిలోమీటర్ల మేర సీసీ కెమెరాలు పరిశీలిస్తే ఈ కారు నడుపుతున్న పోకిరీల డేంజర్ డ్రైవింగ్ బయటపడుతుందని స్థానికులు అంటున్నారు.
దిల్‌సుఖ్‌నగర్ రోడ్డుపై రేవంత్‌రెడ్డి పేరుతో ఓవర్‌స్పీడ్‌తో కారు హల్‌చల్
0
62
Latest Articles
తెలంగాణలో రసవత్తరంగా ఆస్తుల ప్రదర్శన
తెలంగాణ రాష్ట్రం వచ్చి పన్నెండేళ్లు అవుతున్న సందర్భంగా మన రాజకీయ నాయకులు ఎంతగా అభివృద్ధి చెందారో ఇప్పుడు ప్రజలకు కళ్లకు కట్టినట్లు అర్థమవుతోంది. రాష్ట్రం ఏమో కానీ నాయకుల భూబ్యాంకులు మాత్రం ఎకాయెకిన...
- Advertisement -
- Advertisement -


