పవర్ స్టార్ ఓజీ 2 ఆగిందా..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. కెరీర్లో ఎప్పటికీ మరచిపోలేని చిత్రాల్లో ఒకటి ఓజీ. సుజిత్ తెరకెక్కించిన ఓజీ దాదాపు 300 కోట్లకు పైగా కలెక్ట్ చేసి సెన్సేషన్ క్రియేట్ చేసింది. దీంతో ఓజీ 2 పై మరింతగా క్రేజ్ ఏర్పడింది. అయితే.. ఇటీవల ఓజీ 2 ని అనౌన్స్ చేయడం.. స్పెషల్ వీడియో రిలీజ్ చేయడంతో.. త్వరలోనే ఈ క్రేజీ సీక్వెల్ సెట్స్ పైకి వస్తుంది అనుకుంటే.. ఇప్పుడు ఈ భారీ చిత్రం ఆగిందని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. ఇంతకీ.. ఏమైంది..? సుజిత్ ప్లాన్ ఏంటి..? అసలు.. ఓజీ 2 పట్టాలెక్కేది ఎప్పుడు..?

డైరెక్టర్ సుజిత్.. ఓజీ మూవీ తర్వాత నానితో బ్లడీ రోమియో అనే మూవీ స్టార్ట్ చేయాలి. అయితే.. నాని ప్యారడైజ్ మూవీ షూటింగ్లో బిజీగా ఉండడం వలన బ్లడీ రోమియో ఇంత వరుకు సెట్స్ పైకి రాలేదు. ఈమధ్య ఓజీ 2 అనౌన్స్ చేయడంతో.. పవర్ స్టార్ తో ఓజీ 2ని ముందుగా సెట్స్ పైకి తీసుకువస్తారని వార్తలు వచ్చాయి. అయితే.. ఇప్పుడు ప్లాన్ మారిందనేది ఇండస్ట్రీ ఇన్ సైడ్ న్యూస్. ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం.. పవన్ కళ్యాణ్ ఇటీవల ఆపరేషన్ చేయించుకోవడం అలాగే రాజకీయ కార్యక్రమాలతో బిజీగా ఉండటం వల్ల ఓజీ 2 చిత్రీకరణను వచ్చే ఏడాదికి వాయిదా వేసినట్లు తెలుస్తోంది. దీంతో సుజిత్.. ముందుగా నానితో బ్లడీ రోమియో మూవీని స్టార్ట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

ప్రస్తుతం నాని, శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్యారడైజ్ మూవీ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా చిత్రీకరణ సెప్టెంబర్ మొదటి వారానికి పూర్తయ్యే అవకాశం ఉంది. ఇటీవల నాని, కీర్తి సురేష్ పై స్పెషల్ సాంగ్ చిత్రీకరించారు. కొంత ప్యాచ్ వర్క్ బ్యాలెన్స్ ఉంది. దీనిని కూడా త్వరగా పూర్తి చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. సెప్టెంబర్ నెలాఖరున ఈ సినిమాని భారీగా రిలీజ్ చేయాలి అనేది మేకర్స్ ప్లాన్. ఈ మూవీ కోసం నాని చాలా అంటే చాలా హార్డ్ వర్క్ చేశాడు. దాదాపు రెండు సంవత్సరాలు అదే గెటప్ తో ఉన్నాడు. అందుకనే ఈ సినిమా తర్వాత ఎక్కువ టైమ్ తీసుకోకుండా వెంటనే కొత్త సినిమాని స్టార్ట్ చేసేలా ప్లాన్ చేస్తున్నాడని తెలిసింది.

నాని, సుజిత్ కాంబో మూవీని అక్టోబర్‌లో స్టార్ట్ చేయనున్నారని సమాచారం. ఫస్ట్ షెడ్యూల్లో ఢిల్లీలో కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నారు. ఈ సినిమా షూటింగ్‌ను 2027 ఫిబ్రవరి లేదా మార్చి నాటికి పూర్తి చేయాలని చిత్రబృందం లక్ష్యంగా పెట్టుకుంది. 2027 సమ్మర్ లో ఈ సినిమాని రిలీజ్ చేసి ఆతర్వాత పవన్ కళ్యాణ్ తో ఓజీ 2 స్టార్ట్ చేయాలి అనేది సుజిత్ ప్లాన్. అయితే.. ఓజీ 2 ఎప్పుడు సెట్స్ పైకి వస్తుందో క్లారిటీ రావాలంటే.. కొన్ని రోజులు ఆగాల్సిందే..

Latest Articles

తెలంగాణలో రసవత్తరంగా ఆస్తుల ప్రదర్శన

తెలంగాణ రాష్ట్రం వచ్చి పన్నెండేళ్లు అవుతున్న సందర్భంగా మన రాజకీయ నాయకులు ఎంతగా అభివృద్ధి చెందారో ఇప్పుడు ప్రజలకు కళ్లకు కట్టినట్లు అర్థమవుతోంది. రాష్ట్రం ఏమో కానీ నాయకుల భూబ్యాంకులు మాత్రం ఎకాయెకిన...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్