తెలంగాణ రాజకీయాల్లో క్షుద్ర పూజల వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. హరీశ్ రావు క్షుద్రపూజలు చేస్తున్నారని మహేశ్‌కుమార్ గౌడ్ ఆరోపిస్తే… కాదు రేవంత్ రెడ్డే క్షుద్రపూజలు చేస్తున్నారని దాసోజు శ్రవణ్ కౌంటరిచ్చారు. వర్షాలు పడకూడదని, పంటలు పండకూడదని, ప్రజలు కరువుతో అల్లాడి పోవాలని కుతంత్రాలు చేస్తున్నారని మహేశ్ గౌడ్ ఆరోపించారు. తమ దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయన్నారు. బీఆర్ఎస్ ఆవిర్భావం నుంచే అఘోర, తాంత్రిక పూజలు చేయడం వారికి అలవాటుగా ఉందని ఆరోపణలు చేశారు. ఇక కాంగ్రెస్ నేతల ఆరోపణలకు బీఆర్ఎస్ నేతలు కౌంటర్ అటాక్ చేస్తున్నారు. రేవంత్ రెడ్డే క్షుద్ర పూజలు చేస్తున్నారని దాసోజు శ్రవణ్ ఆరోపించారు. ప్రజా సమస్యల నుంచి దృష్టి మళ్లించేందుకే క్షుద్రపూజలంటూ చిల్లర డ్రామాలు ఆడుతున్నారని దాసోజు శ్రవణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలంగాణ రాజకీయాల్లో క్షుద్ర పూజల వ్యాఖ్యల దుమారం
0
59
Previous article
Next article
Latest Articles
ఓబెరాయ్ హోటల్‌కు టీటీడీ స్థలం కేటాయింపుపై భూమన ఆగ్రహం
తిరుపతి అలిపిరి జూపార్క్ రోడ్డులో ఓబెరాయ్ హోటల్ నిర్మాణానికి టీటీడీ స్థలం కేటాయించడంపై మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. టీటీడీ స్థలాన్ని ప్రైవేట్ సంస్థకు కేటాయించడాన్ని...
- Advertisement -
- Advertisement -


