పదేపదే వాడిన నూనె, కృత్రిమ రంగులతో ఆహారం తయారీ

చార్మినార్‌లోని న్యూ లాడ్ బజార్‌లో అక్రమ ఫాస్ట్ ఫుడ్ గోదాముపై H-FAST దాడి చేసింది. FSSAI లైసెన్స్ లేకుండా గోదాం నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. నిషేధిత కృత్రిమ ఆహార రంగులను వినియోగిస్తున్నట్లు తేలింది. పదేపదే వాడిన, పాడైపోయిన వంట నూనెతో ఆహారం తయారీ చేస్తున్నట్లు బయటపడింది. అపరిశుభ్ర వాతావరణంలో ఫ్రైడ్ చికెన్ తయారీ, నిల్వచేస్తున్నట్లు గుర్తించరు.
110 కిలోల ఫ్రైడ్ చికెన్‌ ,6 టిన్నుల వంట నూనె, కృత్రిమ రంగులను స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు బాధ్యులను అదుపులోకి తీసుకున్నారు. ఇలాంటి ఆహార పదార్థాలను తినడం వల్ల ఫుడ్ పాయిజనింగ్, అలర్జీలు, కాలేయ వ్యాధుల ముప్పు ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు.

Latest Articles

జూన్‌ 21న యథాతథంగా నీట్‌ రీ ఎగ్జామ్‌

నీట్‌ యూజీ రీ ఎగ్జామ్‌కు లైన్‌ క్లియర్‌ అయ్యింది. పరీక్షను నిలిపివేయాలంటూ దాఖలైన పిటిషన్లను విచారించిన సుప్రీంకోర్టు.. నీట్‌ పరీక్షను నిలిపివేసేందుకు నిరాకరించింది. పిటిషన్లను అత్యవసరంగా విచారణ జరపాలంటూ అభ్యర్థుల తరపు లాయర్లు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
347FollowersFollow
424,168SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్