బన్నీ రాకా.. ముహుర్తం ఫిక్స్..?

ఐకాన్ స్టార్ నటిస్తున్నక్రేజీ పాన్ వరల్డ్ మూవీ రాకా. ఈ క్రేజీ మూవీ నుంచి బన్నీ బర్త్ డేకి టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఆతర్వాత ఇంత వరుకు ఎలాంటి అప్ డేట్ లేదు. ఇప్పుడు ఈ భారీ చిత్రానికి సంబంధించి అప్ డేట్ ఇచ్చేందుకు ప్లాన్ రెడీ అయ్యిందనేది ఇండస్ట్రీ ఇన్ సైడ్ న్యూస్. ఈసారి పోస్టర్ కాదు.. గ్లింప్స్ రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యారట. ఇంతకీ.. రాకా గ్లింప్స్ రిలీజ్ అండ్ మూవీ రిలీజ్ ఎప్పుడు..?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న రాకా మూవీ ముంబాయిలో షూటింగ్ జరుపుకుంటుంది కానీ.. ఎలాంటి అప్ డేట్స్ మాత్రం ఇవ్వడం లేదు. అలాగే ఎలాంటి లీకులు కూడా బయటకు రావడం లేదు. దీనిని బట్టి ఎంత ప్లానింగ్ తో.. ఎంత సీక్రెట్ గా షూటింగ్ చేస్తున్నారో తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. ఇప్పుడు రాకా మూవీకి సంబంధించి బయటకు వచ్చిన ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏంటంటే.. రాకా గ్లింప్స్ రిలీజ్ చేసేందుకు ప్లాన్ రెడీ చేసారని.. ఆగష్టులో గ్లింప్స్ రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ ఫిక్స్ అయ్యిందని సమాచారం. అసలు బన్నీ బర్త్ డేకే గ్లింప్స్ విడుదల చేయాలి అనుకున్నారు కానీ.. ఫస్ట్ లుక్ పోస్టర్ ఒక్కటే రిలీజ్ చేశారు.

గ్లింప్స్ లో.. బన్నీ క్యారెక్టర్ ఎలా ఉంటుంది..? మిగిలిన క్యారెక్టర్స్ ఏంటి..? అనేది చూపించబోతున్నారట. అంతే కాకుండా.. రాకా రిలీజ్ డేట్ కు సంబంధించిన క్లూ కూడా ఇవ్వనున్నారని టాక్ వినిపిస్తోంది. ఇంతకీ ఎప్పుడు రిలీజ్ చేస్తారంటే.. 2027 డిసెంబర్లో రాకా రిలీజ్ చేసేలా షూటింగ్ చేస్తున్నారని తెలిసింది. ఈ సినిమాలో దీపికా ప‌దుకొణె క‌థానాయిక‌గా న‌టిస్తోంది. అయితే… ర‌ష్మిక‌, జాన్వీ క‌పూర్‌లు కూడా నటిస్తున్నారని వార్తలు అయితే వస్తున్నాయి కానీ.. మేకర్స్ నుంచి అఫీషియల్ గా ఎలాంటి ప్రకటన రాలేదు.

ఈ భారీ, క్రేజీ పాన్ వరల్డ్ మూవీకి సాయి అభ్యంక‌ర్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఇందులో బన్నీ రెండు డిఫరెంట్ క్యారెక్టర్స్ లో కనిపిస్తారని.. అలాగే హీరో అండ్ విలన్ కూడా బన్నీనే అని ప్రచారం జరుగుతుండడంతో.. గ్లింప్స్ లో రెండు క్యారెక్టర్స్ ని చూపిస్తారని.. ఈ విషయం పై క్లారిటీ వస్తుందని బన్నీ ఫ్యాన్స్ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. దాదాపుగా 400 కోట్ల భారీ బడ్జెట్ తో కోలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ ఈ సినిమాని నిర్మిస్తుంది. మరి.. బన్నీ, అట్లీ కలిసి.. ఇండియన్ బాక్సాఫీస్ ని షేక్ చేస్తారేమో చూడాలి.

Latest Articles

హీరో విజయ్‌ దేవరకొండకు TCA లీగల్ నోటీసులు

హీరో విజయ్‌ దేవరకొండకు తెలంగాణ క్రికెట్‌ అసోసియేషన్‌ లీగల్ నోటీసులు పంపింది. HCA టీజీ20 లీగ్‌ను ప్రమోట్‌ చేయడంపై నోటీసులు ఇచ్చింది.  HCA టీజీ20 లీగ్‌కు బీసీసీఐ అనుమతి లేదని TCA పేర్కొంది....
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
347FollowersFollow
424,168SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్