బీజేపీ విజయసంకల్ప యాత్ర ప్రారంభం

       పార్లమెంట్ ఎన్నికల ప్రచారానికి కమలం పార్టీ శ్రీకారం చుట్టింది. నేటి నుంచి మార్చి 2 వరకు విజయసంకల్ప యాత్ర పేరుతో రథయాత్రలు చేపట్టింది. అందులో భాగంగా ఉదయం బాసర సరస్వతీ దేవి ఆలయం నుంచి బీజేపీ విజయసంకల్ప యాత్ర ప్రారంభమైంది. ఎంపీ సోయం బాపురావు, ఎమ్మెల్యే రామారావు పాటిల్.. వాహనాలకు పూజలు నిర్వహించి అనంతరం యాత్రను ప్రారంభించారు. నారాయణపేటలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి పాల్గొన్నారు. తాండూరులో రథయాత్రలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ పాల్గొంటున్నారు. బాసరలో అస్సోం సీఎం హేమంత బిస్వా శర్మ, యాదాద్రిలో గోవా సీఎం ప్రమోద్ సావంత్ రథయాత్రలో పాల్గొంటారు. డీకే అరుణ, ఈటల, లక్ష్మణ్, ఎంపీ ధర్మపురి అర్వింద్ తదితరులు రథయాత్రలో పాల్గొనబోతున్నారు. 17 పార్లమెంట్, 14 అసెంబ్లీ సెగ్మెంట్ల లో 5,500 కిలోమీటర్ల మేర రథయాత్రలు సాగనున్నాయి. విజయసంకల్ప యాత్రలో 106 సమావేశాలు, 102 రోడ్ షోలను బిజెపి నిర్వహిస్తుంది. కేంద్ర ప్రభుత్వ పథకాల లబ్ధిదారులను కమలం పార్టీ నేతలు కలుసుకోనున్నారు. కేంద్ర విజయా లు, కాంగ్రెస్ కుంభకోణాలు, బీఆర్ఎస్ వైఫల్యాలను ప్రజలకు వివరిస్తామని బీజేపీ నేతలు చెప్పారు.

         భైంసాలో ప్రారంభ సభకు అస్సాం సీఎం హేమంత బిస్వా శర్మ హాజరు కానున్నారు. ఆదిలాబాద్, పెద్దపల్లి, నిజా మాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాల్లో యాత్ర సాగనుంది. సమ్మక్క సారలక్క జాతర ఉండటం వల్ల వరంగల్ జిల్లా పరిధిలో మూడు రోజులు ఆలస్యంగా విజయ సంకల్ప యాత్ర ప్రారంభ మవుతుంది. విజయ సంకల్ప యాత్ర ముగింపు సమావేశాన్ని భారీ స్థాయిలో నిర్వహించడానికి రాష్ట్ర కమిటీ నిర్ణయించింది. ముగింపు బహిరంగ సభకు ప్రధాని నరేంద్ర మోడీని తెలంగాణ బిజెపి ఆహ్వానిం చింది. విజయ సంకల్ప యాత్రతోనే పార్లమెంటు ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుడుతోంది కమలదళం.

Latest Articles

గాంధీభవన్‌లో రాహుల్‌ గాంధీ జన్మదిన వేడుకలు..జాబ్‌ మేళా

కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ జన్మదిన వేడుకలను హైదరాబాద్‌లోని గాంధీభవన్ లో ఘనంగా నిర్వహించారు. రాహుల్ గాంధీ జన్మదినం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నేతలతో కలిసి టీపిసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
347FollowersFollow
424,168SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్