కల్కి 2లో.. సాయిపల్లవా..? ఆలియా భట్టా..?

కల్కి ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో తెలిసిందే. అయితే.. కల్కి సీక్వెల్ కల్కి 2 నుంచి బాలీవుడ్ బ్యూటీ దీపికా పడుకునే తప్పుకున్న తర్వాత ఆ పాత్రలో నటించే బ్యూటీ ఎవరు అనేది ఆసక్తిగా మారింది. ఫిదా బ్యూటీ సాయిపల్లవి పేరు వినిపించింది కానీ.. మేకర్స్ మాత్రం ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. లేటెస్ట్ గా ఆలియా భట్ పేరు ప్రచారంలోకి వచ్చింది. దీంతో కల్కి 2లో నటించే బ్యూటీ.. సాయిపల్లవా..? ఆలియా భట్టా..? అనేది హాట్ టాపిక్ అయ్యింది..? ఇంతకీ.. దీపిక ప్లేస్ లో నటించే బ్యూటీ ఎవరు..? ఈ భారీ చిత్రం థియేటర్స్ లోకి వచ్చేది ఎప్పుడు..?

కల్కి మూవీ బ్లాక్ బస్టర్ అవ్వడం.. 1000 కోట్లకు పైగా కలెక్ట్ చేయడంతో.. కల్కి 2 పై అంచనాలు భారీగా ఉన్నాయి. అయితే.. ఇటీవల సెట్స్ పైకి వచ్చిన కల్కి 2 కి సంబంధించి అమితాబ్, కమల్ హాసన్ ల పై కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. సుప్రసిద్ద నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ ఏమాత్రం రాజీపడకుండా మంచి క్వాలిటీతో ఈ సినిమాని నిర్మిస్తుంది. అయితే.. ఈ క్రేజీ మూవీ నుంచి దీపిక పడుకునే తప్పుకోవడంతో.. ఆ పాత్రలో నటించే బ్యూటీ ఎవరు అనేది ఆసక్తిగా మారింది.

దీపిక ప్లేస్ లో.. ఫిదా బ్యూటీ సాయిపల్లవిని తీసుకున్నారని.. గత కొన్ని రోజులుగా ప్రచారం జరిగింది. లేటెస్ట్ గా బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ పేరు వినిపిస్తుంది. దీంతో.. కల్కి 2 లో నటించే బ్యూటీ.. సాయిపల్లవా..? ఆలియా భట్టా..? అనే చర్చ జరుగుతోంది. అయితే.. ఇన్ని రోజులు సైలెంట్ గా ఉన్న నాగ్ అశ్విన్.. ఇప్పుడు కల్కి 2 గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు బయటపెట్టారు. ఇంతకీ ఏం చెప్పారంటే.. సాయిపల్లవిని తీసుకున్నారనే వార్త ఊహాగానమే అని నాగ్ అశ్విన్ తేల్చేసారు. అయితే… ఆలియాని తీసుకున్నారా..? లేదా..? అనేది మాత్రం ఏం చెప్పలేదు.

త్వరలోనే దీపిక ప్లేస్ లో నటించే బ్యూటీ ఎవరు అనేది ప్రకటిస్తామని చెప్పారు. అయితే.. నాగ్ అశ్విన్ మాటలను బట్టి ఆలియానే ఫైనల్ చేస్తారని ప్రచారం మరింత పెరిగింది. ఇక కల్కి 2 రిలీజ్ ఎప్పుడంటే.. ఆగష్టు నుంచి ఏకధాటిగా కల్కి 2 షూటింగ్ చేస్తారట. దీనికి సంబంధించి డేట్స్ ఇచ్చేందుకు ప్రభాస్ ఓకే చెప్పారని సమాచారం. అన్నీ అనుకున్నట్టుగా జరిగితే.. 2027లో కల్కి 2 రిలీజ్ చేయాలి అనేది నాగ్ అశ్విన్ ప్లాన్. మరి.. ఏం జరగనుందో చూడాలి.

Latest Articles

చిన్నారి జ్ఞానేశ్వరి కుటుంబాన్ని పరామర్శించిన హోం మంత్రి అనిత

చిన్నారి జ్ఞానేశ్వరి కుటుంబాన్ని హోం మంత్రి వంగలపూడి అనిత పరామర్శించారు. చిన్నారి కోసం సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుందని ఈ సందర్భంగా ఆమె తెలిపారు. అన్ని కోణాల నుండి దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. చిన్నారి...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
347FollowersFollow
424,168SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్