అమెరికా మిస్సోరీలో జరిగిన స్కైడైవింగ్ ఎయిర్‌క్రాఫ్ట్ క్రాష్‌లో మృతి చెందిన 12 మందిలో 24 ఏళ్ల ఇండియన్ టెకీ కూడా ఉన్నారు. కాన్సాస్ సిటీకి దక్షిణంగా సుమారు 80 మైళ్ల దూరంలో ఉన్న బేట్స్ కౌంటీలోని బట్లర్ మెమోరియల్ ఎయిర్‌పోర్ట్ వద్ద జరిగిన ఈ విమాన ప్రమాదంలో మృతిచెందిన వారిలో ఏకైక భారతీయుడిగా సాయి కార్తీక్ వర్మ దట్లను గుర్తించారు. సాయి లింక్డిన్ ప్రొఫైల్ ప్రకారం.. కాన్సాస్ సిటీ మెట్రోపాలిటిన్ ప్రాంతంలో టెక్నాలజీ నిపుణుడిగా పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. యూనివర్సిటీ ఆఫ్ మిస్సోరీ నుంచి కంప్యూటర్ సైన్స్‌లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశారు,. అనంతరం హెల్త్‌కేర్ టెక్నాలజీ రంగంలో ఉద్యోగం చేస్తూ తన కెరీర్‌ను కొనసాగిస్తున్నారు.
సాయి ప్రస్తుతం అడ్వెంట్ హెల్త్‌లో ఉద్యోగం చేస్తున్నారు. అంతకుముందు ఆయన క్యాప్ జెమినీలో పనిచేశారు. ఉన్నత విద్య కోసం అమెరికాకు వెళ్లిన దట్ల.. అక్కడ క్లౌడ్ మైగ్రేషన్, ఆటోమేషన్, సాప్ట్‌వేర్ డిప్లాయ్‌మెంట్ వంటి సాంకేతిక ప్రాజెక్టులపై పనిచేశారు.


