కోనసీమ జిల్లాలో దారుణం జరిగింది. ఐ.పోలవరం మండలం మురమళ్లలో ఆక్వా రైతు దాట్ల కృష్ణంరాజు దారుణ హత్యకు గురయ్యారు. ఆయన దగ్గర పనిచేస్తున్న కూలీలే అతనిని హత్య చేసి బండరాళ్లను ఆయన నడుముకు కట్టి రొయ్యల చెరువులో పడేశారు.
మురమళ్ల ప్రాంతానికి చెందిన కృష్ణరాజు నిన్నటినుండి కనపడకుండా పోవడంతో కుటుంబ సభ్యులు గాలిస్తుండగా.. అనుమానంతో చెరువు వద్దకు వచ్చి వెతకగా మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. చెరువు వద్ద పనులు చేసేందుకు వచ్చిన పాడేరు ప్రాంతానికి చెందిన ముగ్గురు వ్యక్తులు ఘటన అనంతరం పరారుకావడంతో వారిపైనే పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు.


