అమెరికా – ఇరాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. ఒప్పంద పత్రాలపై అమెరికా, ఇరాన్ దేశాల అధ్యక్షులు సంతకాలు చేశారు. ఒప్పందంలో 14 కీలక అంశాలు ఉన్నాయి. యుద్ధం మొదలైన మూడున్నర నెలల తర్వాత శాంతి ఒప్పందం కుదిరింది. ఒప్పందంలో భాగంగా సైనిక చర్యలను అమెరికా, ఇరాన్ వారి మిత్ర దేశాలు నిలిపివేయనున్నాయి. 60 రోజుల్లో తుది ఒప్పందం కుదుర్చుకొనున్నాయి.
హార్ముజ్ జలసంధిలో ఉచిత నౌకరవాణాకు ఇరాన్ అంగీకరించింది. ఇరాన్ పునర్నిర్మాణానానికి 300 బిలియన్ డాలర్లు ఇచ్చేందుకు అమెరికా అంగీకారం తెలిపింది. అణ్వాయుధాల తయారీ, కొనుగోలు చేయబోమని ఇరాన్ తెలిపింది. ఇక హార్ముజ్ జలసంధిలో ఇరాన్ ఆస్తుల మీద ఆంక్షలు ఎత్తివేతకు అమెరికా అంగీకరించింది.


