హైదరాబాద్ కూకట్పల్లిలోని బ్రౌన్ బేర్ బేకరీలో ఆహార భద్రతా నిబంధనల ఉల్లంఘనలు వెలుగుచూశాయి. ఫుడ్ సేఫ్టీ అధికారులు నిర్వహించిన తనిఖీల్లో పలు పరిశుభ్రత లోపాలు గుర్తించారు. దీంతో బేకరీ యాజమాన్యానికి షోకాజ్ నోటీసు జారీ చేశారు. బేకింగ్కు ఉపయోగించే గుడ్లను సరైన శుభ్రత లేకుండా నిల్వ ఉంచినట్లు అధికారులు గుర్తించారు. ప్రాంగణంలో బొద్దింకల సమస్య ఉండటంతో పాటు తయారీ విభాగంలో ఫ్లోరింగ్ కూడా ప్రమాణాలకు అనుగుణంగా లేదని తేలింది. తుప్పు పట్టిన బేకింగ్ ట్రేలను వినియోగిస్తున్నట్లు తనిఖీల్లో బయటపడింది. ముడి పదార్థాల నిల్వ ప్రాంతంలో పావురాలు సంచరిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. బేకరీలో తయారైన ఉత్పత్తులపై తయారీ తేదీ, గడువు తేదీ వివరాలు లేకపోవడం కూడా గమనించారు. కేవలం బ్యాచ్ నంబర్లతోనే ఉత్పత్తులను విక్రయిస్తున్నట్లు నమోదు చేశారు. ఆహార నమూనాలను సేకరించిన అధికారులు ప్రయోగశాల పరీక్షలకు పంపించారు. పరిశుభ్రత, నిల్వ విధానాలు, లేబెలింగ్ ప్రమాణాలను వెంటనే మెరుగుపరచాలని యాజమాన్యాన్ని ఆదేశించారు. నిబంధనల ఉల్లంఘనల నేపథ్యంలో యాజమాన్యానికి షోకాజ్ నోటీసు జారీ చేశారు.
బ్రౌన్ బేర్ బేకరీలో తనిఖీలు.. బొద్దింకలు, పావురాలు
0
44
Latest Articles
ధనుష్.. ప్లాన్ అదిరింది..
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ తమిళ్, తెలుగు చిత్రాలతో పాటు హిందీ సినిమాలకు సమాన ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇప్పుడు బాలీవుడ్లో మరో ప్రతిష్టాత్మకమైన సినిమా చేసేందుకు ఓకే చెప్పారని టాక్ వినిపిస్తోంది. ధనుష్...
- Advertisement -
- Advertisement -


