యూట్యూబర్, SOCIA MEDIA INFLUENCER హర్షసాయి ఇంకా పరారీలోనే ఉన్నాడు. అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు. హర్ష సాయిపై రేప్ కేస్ నమోదు చేశారు నార్సింగి పోలీసులు. దీంతో ఆయన రెండు రోజులుగా అజ్ఞాతంలో ఉన్నాడు. ఆయనతో పాటు కుటుంబ సభ్యులు కూడా పరారీలో ఉన్నారు.
కూల్ డ్రింక్ లో మత్తు మందు ఇచ్చి అత్యాచారం చేశాడని బాధితురాలి ఫిర్యాదు మేరకు నార్సింగి పోలీసులు కేసు నమోదు చేశారు. అత్యాచారం చేసిన వీడియోను రికార్డ్ చేసి బ్లాక్‌మెయిల్‌కు పాల్పడినట్టు బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. హర్ష సాయితో పెళ్లి చేయిస్తానని హర్ష సాయి తండ్రి బాధితురాలికి సర్ది చెప్పినట్టు తెలుస్తోంది. బాధితురాలి రికార్డింగ్స్ ను మరో యూట్యూబర్ ఇమ్రాన్ ఖాన్ వైరల్ చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. హర్ష సాయితోపాటు, తండ్రి రాధాకృష్ణ, యూట్యూబర్ ఇమ్రాన్ ఖాన్ పై కూడా కేస్ నమోదు చేసిన పోలీసులు.. వారి కోసం గాలిస్తున్నారు.