బైజూస్ వ్యవస్థాపకుడు బైజూ రవీంద్రన్‌కు సింగపూర్ కోర్టు జైలు శిక్ష విధించింది. కోర్టు ఆదేశాలను ధిక్కరించినందుకు ఆయనకు ఆరు నెలల జైలు శిక్ష విధించింది. 2024 ఏప్రిల్ నుంచి ఆయన ఆస్తులకు సంబంధించిన పలు కోర్టు ఆదేశాలను పాటించలేదని సింగపూర్ కోర్టు తెలిపింది. బైజూ రవీంద్రన్ వెంటనే అధికారుల ఎదుట లొంగిపోవాలని ఆదేశించింది. సుమారు 90 వేల సింగపూర్ డాలర్లు జరిమానా చెల్లించాలని చెప్పింది. అలాగే Beeaar Investco Pte అనే సంస్థలో తన చట్టబద్ధ యాజమాన్యాన్ని నిరూపించే డాక్యుమెంట్లను సమర్పించాలని తెలిపింది. ఇప్పటికే తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్న బైజూస్‌కు ఇది మరో పెద్ద ఎదురుదెబ్బగా మారింది. అమెరికాలో 1.2 బిలియన్ డాలర్ల రుణ వివాదంతో పాటు ప్రపంచవ్యాప్తంగా విదేశీ పెట్టుబడిదారులు సంస్థపై న్యాయపోరాటం కొనసాగిస్తున్నారు.
బైజూ రవీంద్రన్‌కు 6 నెలల జైలు శిక్ష విధించిన సింగపూర్ కోర్టు
0
86
Previous article
Latest Articles
మద్యం మత్తులో బావిలో పడి ఇద్దరు యువకులు మృతి
జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం చింతకుంటలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. శివారులోని ఓ బావిలో పడి ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోవడం స్థానికంగా కలకలం రేపింది. పల్నాడు జిల్లా వినుకొండ గ్రామానికి చెందిన...
- Advertisement -
- Advertisement -


