సంస్కరణలు, విజన్‌ పాలిటిక్స్‌కి టీడీపీ ఆదర్శం- చంద్రబాబు

సంస్కరణలు, విజన్‌ పాలిటిక్స్‌కి టీడీపీ ఆదర్శమని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. టీడీపీ ఆవిర్భావం, ప్రస్థానం అన్నీ సంచలనమే అని చెప్పారు. దేశ రాజకీయాల్లో ఇంత ప్రభావం చూపించిన మరో పార్టీ లేదన్నారు. జాతీయ జెండా దేశానికి గర్వకారణమని.. పసుపు జెండా తెలుగువాళ్ల ఆత్మగౌరవమని చెప్పారు. ఈ మహానాడు మహిళలకు అంకితమని అన్నారు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్‌ సాధించి.. మహిళలను చట్టసభలకు పంపిస్తామని చంద్రబాబు అన్నారు. మంగళగిరి కేంద్ర కార్యాలయంలో టీడీపీ మహానాడు నిర్వహిస్తోంది. ఎన్టీఆర్‌ విగ్రహానికి సీఎం చంద్రబాబు నివాళులు అర్పించారు. అనంతరం పార్టీ జెండాను ఆవిష్కరించారు. హైబ్రిడ్‌ విధానంలో రెండు రోజులపాటు మహానాడు నిర్వహిస్తున్నారు. టీడీపీ మహానాడులో 20 తీర్మానాలపై చర్చలు జరపనున్నారు. స్త్రీశక్తి థీమ్‌తో టీడీపీ మహానాడు ఈ ఏడాది నిర్వహిస్తోంది. 1,875 క్లస్టర్లలో భారీ ఎల్‌ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేశారు. క్లస్టర్ల వారీగా మహానాడులో టీడీపీ శ్రేణులు పాల్గొననున్నారు.

Latest Articles

కొరియన్ కనకరాజు వచ్చేస్తున్నాడు..

మెగా హీరో వరుణ్ తేజ్ ఈమధ్య కాలంలో నటించిన సినిమాలు వరుసగా ఫ్లాప్ అయ్యాయి. సరైన బ్లాక్ బస్టర్ కోసం చూస్తున్న వరుణ్ ఈసారి రూటు మార్చి డిఫరెంట్ ఎంటర్ టైనర్ చేస్తున్నాడు....
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్